బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న చిత్రం రోజుకో బలాన్ని సమకూర్చుకుంటోంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి నిర్మాతలు సూపర్ స్కెచ్ గీశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ ఫిలిం బిజినెస్ పరంగా రికార్డులు సృష్టించాలని కమర్షియల్ వే లో అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాకోసం బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వివేక్ విలన్ గా నటించనుండగా, జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వీరిద్దరికీ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అందుకే తీసుకున్నట్లు టాక్. ఇక హీరోయిన్ ని కూడా బాలీవుడ్ కి చెందిన బ్యూటీనే సెలక్ట్ చేసుకునేందుకు సుజీత్ అన్వేషిస్తున్నారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మధి ఫిక్స్ అయ్యారు.
జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు డార్లింగ్ ఫిల్మ్ కి సంగీతాన్ని అందించనున్నారు. ఎక్కువగా దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకోనున్న ప్రభాస్ 19 సినిమాలో ఓ ఫైట్ కి మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలోనే రోజూ వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.