Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

  • September 6, 2026 / 10:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

సెప్టెంబర్ వచ్చింది అంటే బిగ్ బాస్ సీజన్ వచ్చేసినట్టే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ కూడా వేరే లెవెల్. 9 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఇప్పుడు 10వ సీజన్(Bigg Boss 10) ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలానే స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చి, తర్వాత బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి.. హౌస్ లో బిగ్ బాస్ ను పలకరించి కామిడీ చేసి వచ్చారు నాగ్.

Bigg Boss 10

ఆ తర్వాత వరుసగా 16 మంది కంటెస్టెంట్స్ కి వెల్కం చెప్పి హౌస్ లోకి పంపారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరో.. వాళ్ళలో జనాలకి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారో.. తెలుసుకుందాం రండి :

Debjani

1) దేబ్జానీ మోదక్ : ‘ఛాంపియన్’ సినిమాలో గిరగిర గింగిరానివే’ పాటకి చిందులేస్తూ మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది దేబ్జానీ మోదక్. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులకి సుపరిచితమే. ‘బిగ్ బాస్ 10’ సీజన్లో ఈమె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Thrigun

2) త్రిగుణ్ : 2వ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్(ఒకప్పుడు అదిత్ అరుణ్) ఎంట్రీ ఇచ్చాడు. అదిత్ అరుణ్ పేరుతో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మందికి చేరువైన అతను 2.0 అవతారమెత్తినట్టు తెలిపాడు. రామ్ గోపాల్ వర్మ అతని పేరుని త్రిగుణ్ గా మారినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ‘బిగ్ బాస్’ ద్వారా తమ ఇంట్లో కుర్రాడిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలనేది త్రిగుణ్ కోరిక అని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Jhansi

3) ఝాన్సీ : ‘గోల్డెన్ టికెట్ విన్నర్’ కేటగిరీలో మూడో కంటెస్టెంట్ గా సింగర్ ఝాన్సీ ఎంపికయ్యింది. హౌస్ లోకి వెళ్ళే ముందు నాగార్జున కోరిక మేరకు ‘రైతు బిడ్డ’ అంటూ ఓ ఎమోషనల్ సాంగ్ తనదైన శైలిలో పడింది. ఈ పాట ద్వారా తన బిగ్ బాస్ జర్నీని ఎలా ప్లాన్ చేసుకున్నది తెలిపింది. ఇప్పటివరకు తన గొంతుని ఇండస్ట్రీ గుర్తించలేదట. బిగ్ బాస్ ద్వారా దర్శకనిర్మాతలు తన టాలెంట్ ను గుర్తిస్తారని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపింది. అలాగే హౌస్లో ఉండే కుట్రలు, కుతంత్రాలను  తన 100 పర్సెంట్ అఫర్ట్ తో అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేసి హౌస్లోకి వెళ్లింది.

Sudheer Reddy

4) సుధీర్ రెడ్డి : సుధీర్ టాక్స్ పేరుతో పాడ్ కాస్ట్..లు వంటివి చేసి పాపులర్ అయిన ఇతను 4వ కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగార్జునతో తన జీవితంలో ఇప్పటివరకు ఫేస్ చేసిన కష్టాలను వివరించాడు. అలాగే ఇప్పటివరకు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలానే ఇంటర్వ్యూలు చేశానని చెప్పాడు. తర్వాత నాగార్జున ఇతనికి తనని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘హీరోగా, నిర్మాతగా, బిజినెస్మెన్..గా, ఫాధర్ గా సక్సెస్ అయిన మీకు ఏదైనా అసంతృప్తి ఉందా?’ అంటూ ప్రశ్నించాడు సుధీర్. దీనికి నాగార్జున ‘నాకు టైమ్ సరిపోవడం లేదు. నువ్వు చెప్పినవన్నీ సాధించినప్పటికీ, ఇంకా చాలా చేయాలని ఉంది. అందుకు టైమ్ సరిపోవడం లేదు’ అంటూ నాగార్జున బదులిచ్చాడు.

Aman

5) అమన్: అగ్నిపరీక్షలో ఎక్కువ ఓట్లు సంపాదించి 5వ కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు అమన్. తనకి ఓట్లు వేసిన వాళ్ళని డిజప్పాయింట్ చేయాలని తెలిపాడు. ఏడాదిన్నర క్రితం నాగార్జునతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ ఫోటో తీసుకున్నాడట. అది మెమొరీగా పెట్టుకున్నాడట. హౌస్లో ఫ్లిప్ అవ్వకుండా గేమ్ ఆడతానని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆ తర్వాత హోస్ట్ నాగార్జున.. అమన్ కి ఓ టీ షర్ట్ ఇచ్చి. దానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో.. నెక్స్ట్ శనివారానికి చెప్పమని టాస్క్ ఇచ్చాడు నాగార్జున.

Chaithra Rai

6) చైత్ర రాయ్ : 6వ కంటెస్టెంట్ గా చైత్రా రాయ్ ఎంట్రీ ఇచ్చింది. స్వప్నగా పాపులర్ అయిన ఈమె అసలు పేరు చైత్రా అని తెలిపింది. ఓ సినిమా అవకాశం ఈమెకు వచ్చినప్పటికీ.. అనుకోకుండా ‘అష్టా చమ్మా’ సీరియల్లో అవకాశం దక్కించుకుందట. ఎన్నో ఏళ్ళుగా సీరియల్ ఆర్టిస్ట్ గా ఈమె క్రేజ్ సంపాదించుకుందట. అయితే పెళ్లి తర్వాత.. అనుకోకుండా ఈమె వెయిట్ పెరగడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యిందట. దానిని సీరియస్ గా తీసుకుని 80 కేజీలు ఉండే ఆమె 60 కేజీలకి తగ్గిందట. తర్వాత బిగ్ బాస్ అవకాశం వచ్చిందని తెలిపింది. ఒకరకంగా ట్రోలింగ్ తనకి మంచే చేసింది అని పాజిటివ్ గా మాట్లాడింది. బిగ్ బాస్ లో జనాలకి అసలైన చైత్రని చూపిస్తానని చెప్పి హౌస్ లోకి వెళ్లింది.

Ram Prasad

7)ఆటో రామ్ ప్రసాద్ : 7వ కంటెస్టెంట్ గా ‘జబర్దస్త్’ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హుక్ స్టెప్’ సాంగ్ తో హుషారెత్తించే విధంగా స్టెప్పులు వేసి హోస్ట్ నాగార్జున ముందుకు వచ్చాడు. ఎంట్రీలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను చూపించి.. వాళ్ళ మైండ్ వాయిస్ లు చెప్పమంటే తనదైన కామిడీ టైమింగ్ తో హౌస్ మేట్స్ పై పంచులు విసిరాడు. అటు తర్వాత హౌస్లోకి వెళ్ళాడు.

Shalini

8)షాలిని : కామన్ మెన్ కేటగిరీలో 8వ కంటెస్టెంట్ ను ఎంపిక చేసేందుకు జ్యూరీ మెంబర్ అయిన నవదీప్ ను ప్రవేశపెట్టాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత నవదీప్.. షాలిని అనే కామనర్ ను ఎంపిక చేయడం.. తర్వాత హోస్ట్ నాగార్జున ముందుకు తీసుకురావడం జరిగింది. వచ్చిన వెంటనే నాగార్జున అందాన్ని పొగిడే ప్రోగ్రామ్ పెట్టింది షాలిని. స్వతహాగా తాను చాలా ఎక్కువ మాట్లాడతానని హోస్ట్ నాగార్జునకి చెప్పి తర్వాత హౌస్లోకి వెళ్లింది షాలిని.

temper vamsi

9) టెంపర్ వంశీ : 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ‘టెంపర్’ వంశీ. చిరంజీవికి వీరాభిమాని అయిన వంశీ సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్..కి వచ్చి సినిమాల్లోకి అవకాశాల కోసం ప్రయత్నించాడట. ‘నేనింతే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇతను ‘టెంపర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నెగిటివ్ రోల్స్ తో మెప్పించాడు. అయితే తనకి కూడా కుటుంబం ఉందని, ఎమోషన్స్ తెలుసని.. తన రియల్ క్యారెక్టర్ ను ‘బిగ్ బాస్ 10’ ద్వారా జనాలకి చూపించడమే లక్ష్యం అని తెలిపి హౌస్ లోకి వెళ్ళాడు. వెళ్ళేముందు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సినిమాల పాటలకి డాన్స్ కూడా చేశాడు.

  Srishti

10) సృష్టి : 10వ కంటెస్టెంట్ ఎంపిక కోసం జ్యూరీ మెంబర్ శ్రీముఖిని ప్రవేశపెట్టాడు నాగార్జున. ఆమె అపూర్వ, శ్రష్టి..లకి ఓ టెస్ట్ పెట్టి .. ఫైనల్ గా సృష్టిని ఫైనల్ చేసింది. ‘సృష్టిని చూస్తే సీజన్ 3 లో శ్రీముఖి గుర్తుకొస్తుంది’ అంటూ సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంది శ్రీముఖి. ఇక సృష్టి విషయానికి వస్తే.. ‘విల్ పవర్’ అనేది తన స్ట్రెంత్ అని, మనుషులని ఈజీగా నమ్మేయడం వీక్ నెస్ అని చెప్పి హౌస్ లోకి వెళ్లింది.

Naresh

11) నరేష్ : ‘జబర్దస్త్’ ఫేమ్ పొట్టి నరేష్ 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ‘భూమికి జానెడు’ అంటూ సాగే ‘పంజా’ సినిమాలోని పాటకి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గూగుల్ లో నరేష్ అని కొడితే ‘బిగ్ బాస్ 10’ నరేష్ అని రావాలనేది తన తాపత్రయం అని నరేష్ తెలిపాడు.హౌస్ లో కచ్చితంగా ‘గెలిచినంత పనిచేశాడు’ అని జనాలు అనుకునేలా చేస్తానని హామీ ఇచ్చి హౌస్లోకి వెళ్ళాడు.

Charan

12) ఆర్ జె చరణ్ : 12వ కంటెస్టెంట్ గా ‘ఆర్ జె చరణ్’ ఎంట్రీ ఇచ్చాడు. ‘అగ్నిపరీక్ష’ కి వచ్చే ముందు 100K ఫాలోవర్స్ ఉన్నారట ఇతనికి. ‘అగ్నిపరీక్ష’ కి వచ్చాక 190K కి ఫాలోవర్స్ సంఖ్య పెరిగిందట. తన స్ట్రెంత్ తన పర్సనాలిటీ అని, చుట్టుపక్కన ఉన్న వాళ్ళని నవ్వించడం అతని స్ట్రెంత్ అని, తనలా తాను ఉంటూ అందరితో మంచిగా ఉంటూ గేమ్ ఆడతానని హౌస్ లోకి వెళ్ళాడు.

Krishnudu

13) కృష్ణుడు : 13వ కంటెస్టెంట్ గా సీనియర్ నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలపై వ్యామోహంతో ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం పడిన ఇబ్బందులను వివరించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇలా అనేక విభాగాల్లో పనిచేసి.. హీరో అవుదామనుకున్న టైమ్లో యాక్సిడెంట్ అయినట్టు ప్రోమోలో చెప్పుకొచ్చాడు. తర్వాత వెయిట్ పెరగడం ‘వినాయకుడు’ వంటి సినిమాలు చేయడం జరిగిందట. తాను అమాయకుడిని అయితే కాదు అని, ఇంకో యాంగిల్ ఉందని.. బిగ్ బాస్ లో దానిని రివీల్ చేస్తానని తెలిపి హౌస్లోకి వెళ్ళాడు కృష్ణుడు.

14) వర్షిణి సౌందర్‌రాజన్ : 14వ కంటెస్టెంట్ గా యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణి సౌందర్‌రాజన్ ఎంట్రీ ఇచ్చింది. నేను బిగ్ బాస్ కి సెట్ అవుతాను అని కూడా అనుకోలేదు అని, బిగ్ బాస్ కి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ నిద్రపోతున్నప్పుడు వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చిందని తెలిపింది వర్షిణి. ఆ తర్వాత వర్షిణితో కార్డ్స్ గేమ్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత హౌస్లోకి పంపించాడు.

Rohit

15) రోహిత్ : కామన్ మెన్ కేటగిరీలో 15వ కంటెస్టెంట్ ను ఎంపిక చేసుకునేందుకు జ్యూరీ మెంబర్ బింధు మాధవిని ప్రవేశపెట్టాడు హోస్ట్ నాగార్జున. ఆమె రోహిత్ ను ఫైనల్ చేసి నాగార్జున ముందుకు తీసుకొచ్చింది. అతనొక ఆల్ రౌండర్, రొమాంటిక్ గాయ్ అని చెప్పింది బింధు మాధవి. ఆ తర్వాత రోహిత్ కి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి.. హౌస్లోకి వెళ్ళాక ఎవరోక కంటెస్టెంట్ పై ఆ వాటర్ కొట్టాలని చెప్పాడు హోస్ట్ నాగార్జున. కానీ అందుకు రోహిత్ ఒప్పుకోలేదు. కానీ పరీక్ష ఇక్కడి నుండే మొదలైంది అని చెప్పి.. రోహిత్ ను హౌస్లోకి పంపాడు నాగార్జున.

  Mukesh

16) ముఖేష్ గౌడ : 16వ కంటెస్టెంట్ గా సీరియల్ ఆర్టిస్ట్ ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో ఇతని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా ఇతని కెరీర్ మొదలై, సీరియల్ లో హీరోగా అవకాశం పొందాడట. ఇప్పటికీ తాను సింగిల్ అని, నచ్చిన అమ్మాయిని మిస్ చేసుకున్నాడట. టాస్క్ విషయంలో 100 పర్సెంట్ అఫర్ట్ పెడతానని చెప్పాడు ముఖేష్. అయితే హౌస్లో ఉన్నప్పుడు తెలుగులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని ముందుగానే కోరాడు ముఖేష్. ఆ తర్వాత హౌస్లోకి అడుగుపెట్టాడు.

మరి ఈ 16 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తారో చూడాలి.

చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bigg boss nagarjuna
  • #bigg boss season 10
  • #bigg boss telugu 10
  • #BiggBoss
  • #biggboss10

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

7 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

8 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

9 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

16 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

7 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

15 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version