Ram Charan: చరణ్ ఈ టైమ్‌లో ఇంత రిస్క్ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్ ఇస్తాడా?
- September 5, 2026 / 03:33 PM ISTByFilmy Focus Desk
‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్ (Ram Charan) ఏం సంపాదించాడు? ఏం కోల్పోయాడు? అనేది పక్కన పెడితే.. ఆశించిన కమర్షియల్ విజయం అయితే అందుకోలేకపోయాడు. సినిమా కథను వదిలేసి.. ఇతర అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి నానా యాగీ చేశారు. దాంతో సినిమాలోని విషయం, రామ్‌చరణ్ నటన పక్కకు వెళ్లిపోయి.. ఆ ఎక్స్‌ట్రా డిస్కషన్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత అలాంటి ఎక్స్‌ట్రా డిస్కషన్లు పెట్టే సినిమాలు వచ్చినా వాటిని లైట్ తీసుకున్నారు మన జనాలు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా?
Ram Charan
ఉందీ.. కారణం ఉందీ. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ప్రయోగం చేసి కాస్త చేతులు కాల్చుకున్న రామ్ చరణ్ (Ram Charan) మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు అంటూ ఓ చర్చ మొదలైంది. గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ సినిమాలో చరణ్ ప్రధాన పాత్రగా నటిస్తాడు అనే డిస్కషన్ టాలీవుడ్‌లో జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని ప్రముఖ నిర్మాత రీమేక్ హక్కులు తీసుకొని స్టార్ హీరో కోసం చూస్తున్నారని ఓ టాక్.

గుజరాతీలో రూ.50 లక్షల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తన అహంకారం, తప్పుల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన లాలో అలియాస్ కరణ్ జోషి అనే వ్యక్తి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో నిర్మానుష్యమైన ప్రాంతంలోని ఓ ఒంటరి ఇంట్లో లాలో చిక్కుకుపోతాడు. లాలో కుంగిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడు.. శ్రుహద్ గోస్వామి రూపంలో అతనికి కనిపిస్తాడు. ఆ తర్వత ఏమైంది అనేదే కథ.

ఈ కథలో కృష్ణుడి పాత్రను మన దగ్గర రామ్‌చరణ్‌తో (Ram Charan) చేయించాలి చూస్తున్నారట. అయితే మొన్నీమధ్య ప్రయోగం చేసి ఇబ్బంది పడ్డ చరణ్ ఈ సినిమా చేస్తాడా అనేది చూడాలి. అయితే చరణ్ కాదంటే.. విజయ్ దేవరకొండతో ఆ సినిమా చేయించాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
పవన్ – గోగుల.. అప్పుడు మిస్ అయ్యారు.. ఈసారి మిస్ అవ్వకూడదు!















