సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ అనే చెప్పాలి. వాళ్ళు క్లారిటీ ఇచ్చేవరకు వారి పెళ్లి వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. సెలబ్రిటీలు కూడా తాము రోజు వార్తల్లో నిలవాలి, హాట్ టాపిక్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి విషయాల పై తొందరగా క్లారిటీ ఇవ్వరు. ఒకవేళ వాళ్ళ సినిమా ఆఫర్లు దెబ్బ తింటాయేమో అనే భయం వేసినప్పుడు ఈ వార్తల పై క్లారిటీ ఇస్తుంటారు. అప్పటివరకు రియాక్ట్ అవ్వరు.
అయితే ఓ నటి మాత్రం సూటిగా సుత్తి లేకుండా తన బర్త్ డే పార్టీ లోనే ప్రపోజ్ చేసిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయిన దివ్య అగర్వాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తన మాజీ లవర్ వరుణ్ సూద్ తో ఈమె కొన్ని నెలల క్రితమే విడిపోయింది. అయితే ఇటీవల ఆమె బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తనకు అపూర్వ పడ్గాంకర్ ప్రపోజ్ చేశాడు.
అందరి ముందు సిన్సియర్ గా ప్రపోజ్ చేయడంతో అతని ప్రేమను యాక్సెప్ట్ చేసి.. అక్కడే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.అపూర్వ పడ్గాంకర్ ఓ వ్యాపార వేత్త. అతనికి ముంబైలో 4 రెస్టారెంట్లు ఉన్నాయి.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!