Nagarjuna: నాగార్జున సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ!

  • August 3, 2021 / 02:28 PM IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుండి ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని అన్నారు. ఎట్టకేలకు ఈ సీక్వెల్ మొదలవుతుంది. ‘బంగార్రాజు’ టైటిల్ తో ఈ నెల 20న సినిమాను మొదలుపెట్టి సంక్రాంతి బరిలో దింపాలనేది ప్లాన్. అయితే ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో ఒకట్రెండు సీన్లు, ఓ పాటలో యాంకర్ అనసూయ కనిపిస్తుంది.

ఇప్పుడు మరోసారి ఆమెని తీసుకుంటున్నారా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమెకి బదులుగా ఈసారి మోనాల్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఆమె పాత్ర కేవలం పాటకు మాత్రమే పరిమితమయ్యేది కాదట. కాస్త నిడివి ఉన్న రోల్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న మోనాల్ కి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. షోలో ఉన్నన్ని రోజులు హోస్ట్ నాగార్జునపై తన అభిమానాన్ని చాటుకుంది.

ఇప్పుడు ఏకంగా నాగ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జంటగా కృతిశెట్టిలు కనిపించబోతున్నారు. మోనాల్ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

Most Recommended Video



ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus