చాలా మంది డైరెక్టర్లు షూటింగ్ సమయంలో హీరోల జోలికి వెళ్ళరు కానీ.. కొత్త హీరోయిన్స్ ను అలాగే మిగితా ఆర్టిస్ట్ లను నోటికొచ్చిన తిట్లు అన్నీ తిడుతుంటారు అని చాలా మంది చెబుతుంటారు. డైరెక్టర్ కాబట్టి టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది.. టైం కి అన్నీ ఫినిష్ చెయ్యాలి అని నిర్మాతల నుండీ హీరోల నుండీ ఒత్తిడి ఉంటుంది అని కూడా కొంతమంది చెప్పారు. అయితే అందులో ఎంత మాత్రం తప్పు వెతకాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా తిట్టినా క్రమశిక్షణ అనేది ఆర్టిస్ట్ లకు వస్తుంది. తరువాత ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుంది అని ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పుకొచ్చాడు.
ఆయన డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ఈ కామెంట్స్ చేసాడు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు ఆదర్శ్ బాలకృష్ణ. ‘హ్యాపీ డేస్’ ‘రైడ్’ వంటి సినిమాల్లో తన నటనతో అలరించిన ఆదర్శ్, ‘బిగ్ బాస్1’ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఆయన డైరెక్టర్ కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ.. “కృష్ణవంశీ గారి డైరెక్షన్లో నేను ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం చేశాను. ఆయన డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం వస్తే.. ఆర్టిస్టులంతా చాలా అదృష్టంగా ఫీలవుతుంటారు. అయితే కూడా అలాగే ఫీలయ్యాను.. కానీ ఆ చిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులు తిట్లు తిన్నాను.
‘నీకు నటన రాదు .. నువ్వెందుకు పనికి రావు’ అంటూ ఆయన ఒక రేంజ్ లో తిట్టేవారు. ఆ మాటలు చాలా అవమానకరంగా అనిపించినప్పటికీ.. ఎంతో పేషన్స్ తో భరించాను. నా నుంచి మంచి నటనను రాబట్టడం కోసమే ఆయన అలా అంటున్నారనే భావించాను. షూటింగు టైములో కానీ .. ఆ తరువాత కానీ ఆయన పై నాకు కోపం రాలేదు. ఇప్పుడైతే ఆయనతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.మేమిద్దరం కలిసినప్పుడల్లా సరదాగా మాట్లాడుకుంటాము. ఆయన నన్ను తిట్టిన తిట్లను నేను గుర్తుచేస్తుంటే, ఆయన కూడా నవ్వుకుంటూ ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు