టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా టీవీ రంగంలో కూడా పలు సీరియల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఆర్టిస్ట్ ప్రియా సోషల్ మీడియాలో మెల్లగా తన స్థాయిని పెంచుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా కూడా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రియా ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారిగా తన ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇప్పటికే వన్ మిలియన్ ఫాలోవర్స్ దాటారు.
బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాల పాటు కొనసాగిన ప్రియా మొదటి నుంచి కూడా అనేక రకాల క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆమెకు మొదట్లోనే కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయింది. మొత్తానికి ఐదు వారాల పాటు కష్టపడి పోరాడి కెప్టెన్ గా విజయాన్ని అందుకుంది. అయితే ఆర్టిస్ట్ ప్రియా ఇంట్లో పెళ్లి వేడుకలో మొదలైనట్లు ఇటీవల ఒక ప్రత్యేకమైన పోస్టు ద్వారా వివరణ ఇచ్చింది. తన సోదరి కూతురు లోహిత పెళ్లి సందర్భంగా ప్రియా ప్రత్యేకమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
ఇక ఈ పెళ్లి వేడుకలో కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొన్నారు. ఇటీవల హౌస్ లో నుంచి బయటకు వచ్చిన జేస్సితో పాటు ఉమాదేవి, సరయు కూడా పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. ఇక ఆర్టిస్ట్ ప్రియా వారితో దిగిన ఫోటోలను ఒక సెల్ఫీలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
1
2
3
4
5
6
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!