‘బిగ్ బాస్ 4′ బ్యూటీ దివి గురించి తెలియని వారంటూ ఉండరు అనడంలో సందేహం లేదు.’బిగ్ బాస్’ తర్వాత హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. దివి ఫస్ట్ ప్లేస్ ను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.అటు తర్వాత ఈమె చేసిన ఫోటో షూట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.’మహర్షి’ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ‘నయీమ్ డైరీస్’ వంటి చిత్రాల్లో ఈమె నటించి మరింతగా ప్రేక్షకులకి దగ్గరయింది.
అయితే త్వరలో ఈమె పెళ్ళి చేసుకోబోతుందని కొద్ది రోజుల నుండీ వార్తలొస్తున్నాయి. వాటి సంగతేమో కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది దివి. అందులో ‘నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు?” అనే ప్రశ్నకు… దివి ‘మరి కొద్ది రోజుల్లోనే’ అంటూ సమాధానం ఇచ్చింది.దీంతో ఎవర్ని పెళ్ళి చేసుకుంటావు నువ్వు?అనే ప్రశ్నలు ఎక్కువయ్యాయి. వాటికైతే ఆమె స్పందించింది ఏమీ లేదు. కానీ ఆ వీడియోని ప్రమోషనల్ వీడియోలా అనిపిస్తుంది.
బుల్లితెర ప్రేక్షకులకి ఇవన్నీ అలవాటే..! ‘జబర్దస్త్’ వంటి కామెడీ షోలలో కంటెస్టెంట్ లు చాల ప్రాంక్ లు చేశారు. కాకపోతే సినీ ప్రేక్షకులు మాత్రం ఇంకా ఇలాంటివి తొదరపడి నమ్మేసి వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది.దివికి ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇలాంటి టైములో ఆమె పెళ్ళి చేసుకుంటుంది అనుకోవడం అపోహ అయ్యుండొచ్చు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!