తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ అందుకున్నాడు వీజే సన్నీ. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతడికి అవకాశాలు బాగా పెరిగాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఛాన్స్ వస్తున్నాయి. అయితే హౌస్ లోకి వెళ్లకముందే సన్నీ ‘సకల గుణాభిరామ’ అనే సినిమాలో నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో సన్నీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన సోహెల్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. సన్నీ మాట్లాడుతూ.. ”నాల్గో సీజన్లో సోహైల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేశిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా” అని గర్వంగా చెప్పుకొచ్చాడు సన్నీ
ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కప్పు గెలిచాక సన్నీకి పొగరు పెరిగిందంటూ విమర్శిస్తున్నారు. స్టేజ్ పై అందరి ముందు సోహెల్ ను అవమానించడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఈ కామెంట్స్ పై సోహెల్ స్నేహితుడు, బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్థక్ స్పందించాడు. ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ”ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలే తప్ప అవమానించకూడదు.
మనం హీరో అవడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజీ మీద చూడటం చాలా బాధనిపించింది. అక్కడ నేనుంటే బాగుండేది” అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలీట్ చేశాడు.