‘బిగ్ బాస్5’ షోకి ఈసారి మంచి కంటెస్టెంట్ లనే పట్టుకొచ్చారు కానీ… బాగా గేమ్ ఆడే వాళ్ళని త్వరత్వరగా ఎలిమినేట్ చేసేస్తూ వస్తున్నాడు ‘బిగ్ బాస్’. గట్టిగా మాట్లాడి నిలదీసే వారే ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. ఒక్క హమీద నటరాజ్ మాస్టర్ లాంటివాళ్ళని పక్కన పెట్టేస్తే… సరయు, శ్వేతా వర్మ,విశ్వ వంటి వారు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే..! లోబో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడే..! కానీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడంతో హౌస్ కి కళ తగ్గిపోయింది.
కాస్తో కూస్తో గేమ్ ఆడే వాళ్ళలో మానస్ ఒక్కడే కనిపిస్తున్నాడు. అయితే ప్రియాంక సింగ్ తో ఇతనికి ఏదో ఉందన్నట్టు చూపిస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు బిగ్ బాస్. ఆమె కూడా గేమ్ ఆడడం మానేసి ‘మానస్… మానస్’ అంటూ ఇతని చుట్టూనే తిరుగుతోంది. ఇది మానస్ అభిమానులను చిరాకు పుట్టిస్తుంది. అయితే మానస్ మనసులో వేరే అమ్మాయి ఉంది. ఆల్రెడీ అతనికి మూడు బ్రేకప్ లు జరిగాయట.’మానస్ ఫస్ట్ లవ్ తన టెన్త్ క్లాస్ మేట్ అని తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఇంటర్‌లో మరింత దగ్గరవ్వడం ప్రేమగా మారడం జరిగిందట.
కొన్ని కారణాల వలన వీరి ప్రేమకి ఫుల్ స్టాప్ పడింది.అటు తర్వాత బీటెక్లో కూడా ఓ అమ్మాయిని ప్రేమించినట్టు తెలుస్తుంది.మానస్ కి 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమెకి పెళ్ళి జరిగిపోయిందట.అటు తర్వాత కొన్నాళ్ళకి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట మానస్. ఆ అమ్మాయి ఫ్యామిలీకి కూడా మానస్ అంటే ఇష్టం. కానీ ఆ అమ్మాయి యూ.ఎస్ వెళ్ళిపోవడం జరిగిందట. ఇటీవల ఆ అమ్మాయికి కూడా మ్యాచ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కానీ మానస్ కి ఒక్కటే లవ్ స్టోరీ ఉన్నట్టు వాళ్ళ సన్నిహితులు చెప్పుకొస్తున్నట్టు టాక్.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!