కన్నడ సినీ పరిశ్రమకి ఈరోజు బ్లాక్ డే అని చెప్పాలి. ఎందుకో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతి… శాండిల్ వుడ్ నే కాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ పరిశ్రమలను సైతం విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి.ఇక పునీత్ రాజ్ కుమార్ గురించి అతని జర్నీ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుందాం రండి :
1)కన్నడ స్టార్… కంఠీరవం రాజ్ కుమార్ మూడవ తనయుడే ఈ పునీత్ రాజ్ కుమార్.
2) ఇతని వయసు కేవలం 46 ఏళ్ళు మాత్రమే. ఈ ఏడాదితో అతను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు. అదెలా? అతని వయసు 46 ఏళ్ళు అయితే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 ఏళ్ళు ఎలా అయిపోయింది అనుకుంటున్నారా?
3) 1975 వ సంవత్సరం మార్చి 17న జన్మించిన పునీత్ రాజ్ కుమార్ 5 ఏళ్ళ వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసారు అని అంతా అనుకుంటారు.కానీ పునీత్..పుట్టిన 6నెలలకే 20 సినిమాల్లో కనిపించాడు.
4) అతని తండ్రి రాజ్ కుమార్ నటించిన ఎన్నో చిత్రాల్లో పునీత్ నటించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా అతను ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.
5) అంతేకాదు చిన్నతనంలోనే సింగర్ అవతారం ఎత్తి ఎన్నో సినిమాల్లో పాటలు కూడా పాడాడు.
6) పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అప్పు’ చిత్రంతో హీరోగా మారాడు పునీత్. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఇడియట్’.. ‘అప్పు’ కి రీమేక్ అన్న సంగతి ఎక్కువ మందికి తెలుసుండదు.
7) సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా పునీత్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎంతో మంది అనాధలకు జీవనాదారం అయ్యాడు పునీత్.
– 45 ఫ్రీ స్కూల్స్
– 26 అనాధ ఆశ్రమాలు
– 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్
– 19 గోశాలలను…. నడిపిస్తూ వచ్చాడు పునీత్.సాయం చేయడంలో ఇతని చెయ్య పెద్దదే.
8) అంతేకాదు అతని రెండు కళ్ళను దానం కూడా చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అతను అక్కడ సూపర్ స్టార్ గా ఎదగడానికి ఇవి కూడా కారణం అని చెప్పొచ్చు.
9)పునీత్ అద్భుతమైన డాన్సర్ కూడా.అతని డ్యాన్స్ లకు సెపరేట్ ఫాన్ బేస్ ఉందక్కడ.
10) తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు, దూకుడు వంటి చిత్రాల రీమేక్ లలో నటించాడు. అలాగే అతను హీరోగా నటించిన ‘ఇడియట్’ ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాలు తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి. ఈ ఏడాది ‘యువరత్న’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు పునీత్. ఇక్కడ ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది.
11) ఈ ఏడాది కన్నడ పరిశ్రమకి ‘ల్యాండ్ మార్క్ ఇయర్’ అని అంతా అనుకున్నారు. కిచ్చా సుదీప్ నటుడిగా 25 ఏళ్ళుగా పూర్తి చేసుకుంటే,పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ నటుడిగా 35 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు.ఇక పునీత్ కూడా ఈ ఏడాదితోనే 45 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు. కానీ ఇదే ఏడాది అతను అందరికీ దూరం అయిపోతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.