బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె మౌనరాగం జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ సొంతం చేసున్నటువంటి ప్రియాంక బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు .
ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందే సీరియల్ నటుడు శివకుమార్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నారు.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె తన ప్రియుడు శివకుమార్ ఇద్దరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పెళ్లి గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. చాలామంది మా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు
అయితే మా పెళ్లి త్వరలోనే జరగబోతుంది అంటూ ఈమె తెలిపారు 2024లో మా పెళ్లి కచ్చితంగా జరుగుతుందని అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని కూడా త్వరలోనే చెబుతాను అంటూ ప్రియాంక తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఈమె హెయిర్ కట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి కూడా (Priyanka Jain) ప్రియాంకకు ప్రశ్నలు ఎదురు కావడంతో ప్రియాంక సరదాగా సమాధానం చెప్పారు నా జుట్టు పెరిగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఈమె కామెంట్ చేయడం విశేషం. మరి ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పినటువంటి ప్రియాంక ఏడాది మొదట్లో చేసుకుంటారా లేక చివరి వరకు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.