Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » Dunki Review in Telugu: డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Dunki Review in Telugu: డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 21, 2023 / 12:44 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dunki Review in Telugu: డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • షారుక్ ఖాన్ (Hero)
  • తాప్సి (Heroine)
  • విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ (Cast)
  • రాజ్ కుమార్ హిరానీ (Director)
  • గౌరీఖాన్ - రాజ్ కుమార్ హిరానీ - జ్యోతి దేశ్ పాండే (Producer)
  • ప్రీతమ్ - అమన్ పంత్ (Music)
  • సి.కె.మురళీధరన్ - మనుష్ నందన్ - అమిత్ రాయ్ - కుమార్ పంకజ్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 21, 2023
  • జియో స్టూడియోస్ - రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ - రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్ (Banner)

“పఠాన్, జవాన్” సినిమాలతో వరుసపెట్టి వెయ్యి కోట్ల రూపాయల విజయాలు సాధించి బాలీవుడ్ లో మళ్ళీ తన సత్తాను చాటుకున్న షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కగా ఈ ఏడాది విడుదలైన మూడో చిత్రం “డంకీ”. “3 ఇడియట్స్, సంజు” తదితర చిత్రాలతో దర్శకుడిగా మహోన్నత స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ చిత్రంపై ఎనౌన్స్ మెంట్ టైమ్ నుండి భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను షారుక్ & రాజ్ కుమార్ హిరానీ అందుకోగలిగారా? ముఖ్యంగా బాక్సాఫీస్ పై డైనోసార్ గా దాడి చేయనున్న “సలార్” ముందు నిలబడే సత్తా ఉందా అనేది చూద్దాం..!!

కథ: తనను బ్రతికించిన వ్యక్తిని ఒకసారి కలిసి.. అతడి టేప్ రికార్డర్ ఇచ్చేద్దామని పఠాన్ కోట్ నుండి పంజాబ్ లోని లల్టు అనే గ్రామానికి వస్తాడు హృదయ్ సింగ్ అలియాస్ హార్డీ (షారుక్ ఖాన్). అయితే.. ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని అతడి చెల్లెలు మను (తాప్సి) కల అయిన లండన్ వెళ్ళడానికి సహాయపడాలనుకుంటాడు.

ఎన్ని తిప్పలు పడినా వీసా రాకపోవడంతో.. ఆఖరికి దొంగతనంగా లండన్ చేరాలనుకుంటారు. అందుకోసం వాళ్ళు పడిన తిప్పలు, బాధల సమాహారమే “డంకీ” చిత్రం.

నటీనటుల పనితీరు: షారుక్ ఖాన్ ఎప్పట్లానే హార్డీ పాత్రను తన భుజాలపై మోసుకొని వెళ్ళాడు. అయితే.. ఆ పాత్రలో ఎమోషన్ ఎక్కడా వర్కవుటవ్వలేదు. విక్కీ కౌశల్ చిన్న పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ అతడి పాత్ర పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. తాప్సి నటిగా ఈ సినిమాకి ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయింది. షారుక్ తో ఆమె కెమిస్ట్రీ కూడా సరిగా పండలేదు. బోమన్ ఇరానీ తదితరులకు సరైన పాత్రలు లభించలేదు.

సాంకేతికవర్గం పనితీరు: షారుక్ & హిరానీ కెరీర్లలో అత్యంత తక్కువస్థాయి క్వాలిటీ సినిమాగా “డంకీ” ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చూస్తే ఇది నిజంగానే 120 కోట్ల రూపాయల సినిమానా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాలీవుడ్ స్థాయిలో లేదు. నేపధ్య సంగీతం కూడా ఎమోషనల్ కంటెంట్ కి వర్కవుటవ్వలేదు. ప్రీతమ్ పాటలు మాత్రం బాగున్నాయి.

దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ స్థాయికి తగ్గ సినిమా కాదు ఇది. ఆయన తెరకెక్కించిన మునుపటి చిత్రాలు కరడుగట్టిన క్రిమినల్స్ తో కూడా కన్నీరు పెట్టిస్తాయి. కానీ.. “డంకీ”లో అలా కన్నీరు పెట్టించే మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్. అలాగే.. కథనం సినిమాకి మరో మైనస్ గా నిలిచింది. చాలా చిన్న పాయింట్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో రచయితలు దారుణంగా విఫలమయ్యారు. ఈ సినిమా యూనిట్ లో విధు వినోద్ చోప్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

విశ్లేషణ: షారుక్ & రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ కదా అని భారీ అంచనాలతో థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశపడతారు. కాకపొతే.. హిరానీ మార్క్ కామెడీ & పాటలు కాస్తంత బాగున్నాయి కాబట్టి.. ఓపిగ్గా ఒకసారి చూడొచ్చు. కానీ.. “సలార్” ముందు ఈ చిత్రం నిలదొక్కుకోవడం మాత్రం కష్టం.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boman Irani
  • #Dunki
  • #Shah Rukh Khan
  • #Taapsee Pannu
  • #Vicky Kaushal

Reviews

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

trending news

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

7 mins ago
Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

3 hours ago
Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

15 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

15 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago

latest news

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

17 hours ago
Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

18 hours ago
Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

18 hours ago
Vijay Deverakonda: ఇంకెన్నాళ్లు ఇదే పబ్లిసిటీ దేవరకొండ?

Vijay Deverakonda: ఇంకెన్నాళ్లు ఇదే పబ్లిసిటీ దేవరకొండ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version