బిగ్ బాస్ సీజన్ – 7 లో బిగ్ బాస్ టీమ్ ప్లాన్ మారుస్తోందా..! అదేంటంటే.?

  • December 21, 2022 / 03:35 PM IST

బిగ్ బాస్ సీజన్ – 7 నుంచీ నాగార్జున యాంకరింగ్ చేయట్లేదా అంటే నిజమే అంటున్నారు అందరూ. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే హోస్ట్ గా నాగార్జున బిగ్ బాస్ షో కి గుడ్ బై చెప్పేశారు. అయితే, ఇప్పుడు సీజన్ 7కి ఎవరు హోస్ట్ గా రాబోతున్నారు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దగ్గుబాటి రానా పేరు గట్టిగా వినిపిస్తోంది. రానా గతంలో చాలా షోలకి యాంకరింగ్ చేశాడు. నెంబర్ వన్ యారీ , టాక్ షో , సైమా అవార్డ్స్ ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు తనలోని యాంకరింగ్ టాలెంట్ ని చూపిస్తునే ఉన్నాడు.

ఈసారి రానా వచ్చే అవకాశం ఉంది. రానా అయితే డీల్ చేయగలడు. హౌస్ మేట్స్ ఆడే స్మార్ట్ గేమ్, ఓవర్ స్మార్ట్ గేమ్ అన్నీ కూడా పసిగట్టి మరీ మాట్లాడగలడు. అలాగే, ఇంకో పేరు కూడా గట్టిగా విపిస్తోంది. అది హీరో నవదీప్. నవదీప్ సీజన్ 1లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. కేవలం తారక్ కోసమే వచ్చానని అప్పుడు చెప్పాడు కూడా. అయితే, ఈసారి నవదీప్ ని కూడా యాంకరింగ్ కి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నవదీప్ వచ్చినా కూడా స్మార్ట్ గా హౌస్ మేట్స్ ని హ్యాండిల్ చేస్తాడు. మ్యాగ్జిమమ్ వాళ్లనుంచే నిజాలు రాబట్టేస్తాడు. స్మార్ట్ యాంకర్ అవుతాడు నో డౌట్.

ఎందుకంటే, ఆల్రెడీ ఫార్మాట్ బాగా తెలుసు. అందులోనూ ఎవరితోనైనా సరే నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. వెనక ముందు ఏమీ చూస్కోడు. గతంలో సూపర్ అనే షోని బాగా హ్యాండిల్ చేశాడు. అప్పుడు అందరూ అమ్మాయిలనే డీల్ చేశాడు. అలాగే, నవదీప్ లో స్పాంటినిటీ కూడా చాలా బాగుంటుంది. సో నవదీప్ కి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరికి ఛాన్స్ ఉందంటే, విజయ్ దేవరకొండ. కానీ, విజయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్ బాస్ కి సైన్ చేస్తాడా లేదా అనేది డౌటే. ఎందుకంటే, చేతినిండా సినిమాలతో హై రెమ్యూనిరేషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఒకవేళ చేస్తే మాత్రం సీజన్ – 7 ఇంకో స్టెప్ ఎక్కినట్లే. వీళ్ల ముగ్గురికీ అయితే ఛాన్సెస్ ఉన్నాయి.

ఇక ఈసంవత్సరం ఓటీటీ వచ్చే ఛాన్సెస్ లేదు. లాస్ట్ సీజన్ లోనే ఎనౌన్స్ చేశారు ఇదే ఆఖరిది అని, కాబట్టి ఓటీటీ బిగ్ బాస్ ఉండదు. సీజన్ – 6లో చేసిన తప్పులు చేయకుండా బిగ్ బాస్ టీమ్ ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తోంది. మరో ఆరునెలల్లోనే బిగ్ బాస్ సీజన్ – 7 ని తీస్కుని రాబోతోంది. జూన్ – జులై ఈ రెండు నెలల్లో ఏదో ఒక డేట్ అయితే ఎనౌన్స్ చేస్తారు. ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. రేటింగ్ పరంగా కూడా ఈసారి చాలా జాగ్రత్తలు తీస్కుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువమంది ఉండేలా సీజన్ – 7లో పార్టిసిపేట్ చేసేలా చూస్తున్నారు.

లాస్ట్ సీజన్ లో మిస్ అయినవాళ్లు, మాజీ కంటెస్టెంట్స్, సినిమా ఆర్టిస్ట్ లు , ఓటీటీలో పార్టిసిపేట్ చేసినవాళ్లు ఇలా మిక్స్ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈసారి సీజన్ లో ట్విస్ట్ లు ఉండే ఛాన్స్ ఉంది. దానిని సరికొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. స్టైల్ అయితే ఖచ్చితంగా మారుస్తారు. ఎందుకంటే, ఇప్పుడు సీజన్ 6 తెలుగు మాత్రం తుప్పాస్ అంటే తుప్పాస్ గా ఎండ్ అయ్యింది కాబట్టి, ఈసారి మాత్రం చాలా కేర్ తీస్కునే చాన్స్ ఉంది. మరి చూద్దాం.. సీజన్ – 7 ఎలా ముస్తాబవుతుంది అనేది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus