Bigg Boss 8 Contestants: ‘బిగ్ బాస్ 8’ ఈ లిస్ట్ అంతా ఫేకేనా..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించింది. టీఆర్పీ రేటింగ్లు దారుణంగా పడిపోతున్న ఈ రోజుల్లో ‘బిగ్ బాస్’ షో మాత్రం ప్రతీ ఏడాది సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికే 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. సీజన్ 8 కి కూడా రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 1 న ప్రోమో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ చేస్తారా? కంటెస్టెంట్లు ఎవరు? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే కొంతమంది సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. వాళ్ళే…

1) రాజ్ తరుణ్ (Raj Tarun)

2) ప్రభాస్ శ్రీను (Prabhas Sreenu)

3) గాయత్రీ గుప్తా  

4) యాంకర్ వింధ్య

5) ఆస్ట్రాలజర్ వేణు స్వామి

6) యాంకర్ నిఖిల్

7) యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ

8) డాన్సర్ శ్వేతా నాయుడు

9) నటి దీపిక

10) సీరియల్ నటుడు ఇంద్రనీల్

11) కమెడియన్ సద్దాం (Saddam)

12) కమెడియన్ యాదమ్మ రాజు 

13) సీనియర్ నటి సన (Sana)

14) ‘జబర్దస్త్’ కమెడియన్ కిరాక్ ఆర్పీ

15) యాంకర్ శివ

అయితే ఈ 15 మందిలో హీరో రాజ్ తరుణ్ ‘బిగ్ బాస్ 8’ కి వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అలాగే యాంకర్ వింధ్య కూడా ఇప్పుడు వరుస ఈవెంట్లతో బిజీగా గడుపుతోంది. సో ఆమె కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ లేదు. ఇక వేణు స్వామికి కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ.. చివర్లో ఆ ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus