నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు.
టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ రెట్టింపు చేశాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. 4వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.నిన్న 27వ రోజు వినాయక చవితి హాలిడే కూడా ఈ మూవీకి కలిసొచ్చినట్టు అయ్యింది. ఒకసారి 27 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
11.62 cr
సీడెడ్
7.92 cr
ఉత్తరాంధ్ర
4.83 cr
ఈస్ట్
2.00 cr
వెస్ట్
1.47 cr
గుంటూరు
2.24 cr
కృష్ణా
1.61 cr
నెల్లూరు
0.94 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
32.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.30 cr
ఓవర్సీస్
2.37 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
37.30 cr
‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.27 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.37.30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పటివరకు బయ్యర్లకు రూ.21.30 కోట్ల లాభాలను అందించింది.
కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా రూ.37 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. నిన్న వినాయక చవితి హాలిడే కూడా కలిసి రావడంతో ఈ మూవీ ‘లైగర్’ కంటే బెటర్ గా కలెక్ట్ చేసింది అని చెప్పాలి.