అలరిస్తున్న ‘బ్లఫ్ మాస్టర్’ ఆడియో..!

  • December 21, 2018 / 08:07 AM IST

‘జ్యోతి లక్ష్మీ’ ‘ఘాజీ’ ‘క్షణం’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు హీరో సత్యదేవ్. ఒక పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే మరోపక్క హీరోగా మంచి స్టోరీ లైన్లు ఎంచుకుంటుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సత్యదేవ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తాజాగా ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. సత్యదేవ్ గతంలో ఛార్మితో నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రానికి సంగీతమందించిన సునీల్ కశ్యప్ ‘బ్లఫ్ మాస్టర్’ కు కూడా సంగీతాన్ని అందించడం విశేషం. తాజాగా విడుదల చేసిన ఈ ఆడియో జ్యూక్ బాక్స్ లో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఇక అవి ఎలా ఉన్నాయంటే.. ?

ఏవో రంగుల పరిచయం

రామజోగయ్య శాస్త్రి రచించే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆల్బమ్ లో మొత్తం రెండు పాటలు రాసాడు రామజో. ఇందులో ఒకటైన ‘ఏవో రంగుల పరిచయం’ అనే పాటకి సునీల్ కశ్యప్ ఇచ్చిన ట్యూన్ సూపర్ అనే చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి చక్కని పదాలతో అల్లిన ఈ పాటని శ్రీచరణ్ అద్భుతంగా పాడాడు. మెలోడీని ఇష్టపడే వారిని ఈ పాట కచ్చితంగా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు.

ఏ మాయ ఏమో

ఇక విశ్వనాథ్ ‘ఏ మాయ ఏమో’ అనే పాటను రచించాడు. హీరోయిన్ నాదిత శ్వేతా హీరో సత్య దేవ్ కు మధ్య వచ్చే లవ్ సాంగ్ లా ఇది ఉండబోతుందేమో. ప్రముఖ గాయని సునీత పాడిన ఈ పాట కూడా అద్భుతమనే చెప్పాలి. విశ్వనాధ్ రచించిన లిరిక్స్ మరియు సునీల్ కశ్యప్ ఇచ్చిన ట్యూన్ కు సునీత ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

నీతోనే

ఇక ‘నీతోనే’ అంటూ సాగే మరో పాటను రామజోగయ్య శాస్త్రి రచించాడు. హీరో, హీరోయిన్స్ కు మధ్య వచ్చే ఫీల్ గుడ్ సాంగ్ గా ఇది ఉండబోతుందనుకుంట. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అయిన సునీల్ కశ్యప్ పడటం విశేషం. కొంచెం ట్యూన్ ఎక్కువగా సాగుతూ.. ఇది చిన్న బిట్ సాంగ్ లాగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. లిరిక్స్ చాలా బాగున్నాయి.

శత్కర్మభిష్ట

ఇక నాలుగో పాత అయిన ‘శత్కర్మభిష్ట’ అనే పాట. ‘చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే..’ అనే థీమ్ తో సాగే పాట ఈ ఆల్బంలోనే ధీ బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. మదురకవి కోగంటి వెంకటాచార్యులు , కలిసి రచించిన ఈ పాట సునీల్ కశ్యప్ అద్భుతమైన ట్యూన్ ఇవ్వడం విశేషం. ఇది కూడా అన్ని వర్గాల సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలాగే సాగుతుంది. ముఖ్యంగా విజువల్ గా ఈ సాంగ్ ఈ చిత్రంలో అద్భుతంగా వచ్చిందని సమాచారం.

చివరి మాట..
ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు . అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. మరి ఈ చిత్రంలో ఈ పాటలు ఎలా తీర్చిదిద్దారనేది చూడాల్సి ఉంది. ఒక వేళ ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేస్తే .. మ్యూజిక్ డైరెక్టర్ అయిన సునీల్ కశ్యప్ కు మంచి అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 28 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus