Bobby Deol: బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన బాబీ దేవోల్.. అద్భుతమైన వ్యక్తంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య  (Balakrishna) బాబీ (Bobby)  కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు నిర్మాత కాగా 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాబీ దేవోల్ (Bobby Deol ) బాలయ్య గురించి మాట్లాడుతూ బాలయ్యతో పని చేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

Bobby Deol

బాలయ్య సీనియర్ హీరో అయినా ఆయన మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం అని బాబీ దేవోల్ పేర్కొన్నారు. బాలయ్య చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. డైరెక్టర్ బాబీ కూడా చాలా మంచి వ్యక్తి అని బాబీ దేవోల్ వెల్లడించారు. బాలయ్య, బాబీ లాంటి అద్భుతమైన వ్యక్తులతో పని చేసే ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కంగువా మూవీ గురించి బాబీ దేవోల్ మాట్లాడుతూ యానిమల్ సినిమా కంటే ముందే ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అన్నారు.

సూర్య (Suriya) గొప్ప నటుడు అని కంగువా (Kanguva) మూవీలో నా రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. బాబీ దేవోల్ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్ద్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు.

మళ్ళీ తెరపైకి ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా ప్రస్తావన?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus