Pawan Kalyan: పవన్ కోసం బాలీవుడ్ విలన్!

  • October 30, 2022 / 12:18 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులను ఎంపిక చేసుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడిని ఆన్ బోర్డ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మల్ల యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారట. కొన్ని రోజుల క్రితం దర్శకుడు క్రిష్ ఆయన్ను కలిసి కథ, పాత్ర తీరుని వివరించినట్లు తెలుస్తోంది. వెంటనే బాబీ డియోల్ అంగీకరించారని తెలుస్తోంది. నవంబర్ లో ఆయన హైదరాబాద్ వచ్చి.. షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ వర్క్ షాప్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడుతున్నారు. స్టంట్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తోదోర్ లాజరోవ్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కనిపించనుంది. అలానే కీలకపాత్రలో నర్గీస్ ఫక్రి నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus