Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Gehraiyaan: దీపిక – అనన్య కొత్త సినిమా టీజర్‌ చూశారా!

Gehraiyaan: దీపిక – అనన్య కొత్త సినిమా టీజర్‌ చూశారా!

  • December 20, 2021 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gehraiyaan: దీపిక – అనన్య కొత్త సినిమా టీజర్‌ చూశారా!

బోల్డ్‌ సీన్లు ఎక్కువ ఉన్నాయని… థియేటర్లలో కాకుండా ఓటీటీలో ఓ సినిమా నేరుగా విడుదల చేస్తున్నారని ఆ మధ్య మన వెబ్‌ సైట్‌లో చదివారు గుర్తుందా? దీపిక పడుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా అని కూడా మనం రాశాం. ఆ సినిమా టీజర్‌ ఇప్పుడు విడుదలైంది. సినిమా దర్శకుడు ఎందుకు డైరెక్ట్‌ ఓటీటీ అన్నాడో. ఆ టీజర్‌ చూస్తేనే అర్థమపోతుంది. చిన్నపాటి వీడియోలోనే బోల్డ్‌నెస్‌ను పక్కాగా చూపించారు దర్శకుడు షకున్‌ బత్రా.

దీపికా పడుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది… అనన్యా పాండే- ధైర్యా కర్వా జంటలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరు చెప్పలేదు కదా… ‘గెహ్రహియా’. ముందుగా చెప్పినట్లు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్‌ చేస్తున్నారు. మోడరన్‌ లైఫ్‌లో బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు నేపథ్యంలో దర్శకుడు షకున్‌ బత్రా ఈ సినిమా రూపొందించారు. ఇందులో భాగంగా రెండు జంటల కథను తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ జంటల మధ్య జరిగే ముద్దు ముచ్చట్లు, హద్దు మీరడాలు, అలకలు, కోపాలు, కష్టాలు, నష్టాలకు ఈ సినిమా వేదికగా ఉంటుందట.

చిన్నపాటి టీజర్‌లోనే ఇలాంటి బోల్డ్‌ సీన్లు బోలెడు ఉన్నాయి. దీంతోపాటు సినిమా చిత్రీకరణ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా జనవరి 25న స్ట్రీమ్‌ అవుతుంది. విడుదల చేసిన టీజర్‌ చూస్తే… ఈ సినిమాలో దీపిక పడుకొణె… సిద్ధాంత్‌ చతుర్వేదితో ముద్దు సన్నివేశాల్లో మునిగి తేలుతోంది. అనన్య పాండేకు కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నసీరుద్దీన్‌ షా, రాజాత్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సుమిత్‌ రాయ్‌ కథ అందించగా కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌, వయాకమ్‌ 18 తదితర నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. షకున్‌ బత్రా సినిమాలు అంటే… రియల్‌ లైఫ్‌కు దగ్గరగా ఉంటాయి అని గతంలోనే నిరూపించారు. ఇప్పుడు ‘గెహ్రహియా’తో మరోసారి ఆ తరహా ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఇందులో బోల్డ్‌నెస్‌ ఎంత మాత్రం ఉంది అనేదే ఇప్పుడు ప్రశ్న.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Deepika Padukone
  • #Gehraiyaan
  • #Siddhant Chaturvedi

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

18 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

22 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

23 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

23 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

23 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

14 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

15 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version