Pushpa Movie: ‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో మూడవ చిత్రంగా తెరకెక్కిన ‘పుష్ప’ మరికొన్ని గంటల్లో అంటే డిసెంబర్ 17న రేపు విడుదల కాబోతుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.రెండో భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదల కాబోతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ‘ముత్తం శెట్టి మీడియా’ సంస్థతో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఎందుకు చూడాలి.. అసలు ‘పుష్ప’ లో ఆకర్షించే అంశాలు ఏంటి అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1)అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఆర్య’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘ఆర్య2’ కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ‘పుష్ప’ కాబట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండీ భారీ అంచనాలు నమోదయ్యాయి..!

Allu Arjun With Sukumar

2) ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత సుకుమార్ నుండీ రాబోతున్న చిత్రమిది.

3)’అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుండీ రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రంలో పుష్ప రాజ్ పాత్రలో అతను రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు.

4)వరుస హిట్లు సాధిస్తూ టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ గా చలామణి అవుతున్న రష్మిక మందన హీరోయిన్ గా నటించిన చిత్రమిది. ఈ చిత్రంలో ఆమె శ్రీవల్లి అనే డీ గ్లామరస్ పాత్రని పోషించింది. నేషనల్ క్రష్ కాబట్టి… ఈమె కోసం కూడా ‘పుష్ప’ ని చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

5) మలయాళం స్టార్ హీరో మరియు నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండడం మరో ఆకర్షించే అంశం.

6)కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా నటించి రాణించిన సునీల్ అటు తర్వాత హీరోగా కూడా మారి సక్సెస్ అయ్యాడు. అయితే అతనికి విలన్ గా రాణించాలని ఆశ. ‘డిస్కో రాజ’ ‘కలర్ ఫోటో’ వంటి చిత్రాల్లో విలన్ గా ట్రై చేసి ఆకర్షించాడు. అయితే పుష్ప సినిమాలో మంగళం శ్రీను గా విలన్ షేడ్స్ కలిగిన పాత్రలో చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇతని పాత్ర కూడా హైలెట్ అవుతుందని చిత్రబృందం చెబుతుంది.

7)ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ కి మించి అన్నట్టు మరో మారు విభిన్నమైన దాక్షాయణి పాత్రని పోషిస్తుంది.నోట్లో బ్లేడు పెట్టుకుని టీజర్, ట్రైలర్లో కనిపించడంతో జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది.

8)’భైరవగీత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు కన్నడ క్రేజీ యాక్టర్ ధనంజయ. ‘పుష్ప’ లో తను సెమి విలన్ గా కనిపించబోతున్నాడు. ఇతని పాత్ర కూడా చాలా బాగా వచ్చింది.

9)అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రమిది. అదే విధంగా సుకుమార్ తెరకెక్కించిన మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

10) దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. శ్రీవల్లి, సామి సామి అనే పాటలు ప్రతీ చోటా వినిపిస్తున్నాయి. విజువల్ గా కూడా అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనిపిస్తుంది.

11) మీరోస్లా కూబా బ్రోజెక్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఓ రేంజ్లో ఉంది. టీజర్, ట్రైలర్లలోనే విజువల్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. సినిమాలో కూడా దిరిపోతాయి అనే ఫీలింగ్ తెప్పిస్తున్నాయి.

12) ‘రంగస్థలం’ లో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నర్తిస్తే… ఇందులో సమంత ఐటెం సాంగ్లో నర్తించింది. ఈ పాట కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది.

Share.