నందమూరి హీరో కోసం బాలీవుడ్ భామ!

టాలీవుడ్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ అనేవి చాలా కామన్. కమర్షియల్ చిత్రాలంటే అందులో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. దీనికోసం మేకర్లు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. ప్రత్యేకంగా సెట్ వేసి మరీ ఈ పాటను చిత్రీకరిస్తుంటారు. ఒకప్పుడు ఇలాంటి పాటల్లో నటించడానికి సెపరేట్ గా నటీమణులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో నటించేస్తున్నారు. కాజల్, శృతిహాసన్, తమన్నా ఇలాంటి చాలా మంది స్టార్ హీరోయిన్లు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఏకంగా బాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. గతేడాది ‘ఎంతమంచి వాడవురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ వరినా హుస్సేన్ ను ఎంపిక చేసుకున్నారు.

పాకిస్థాన్ కు చెందిన ఈ భామ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈమెని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇటీవల కళ్యాణ్ రామ్, వరీనా హుస్సేన్ ల మధ్య ఐటెం సాంగ్ ను రామకృష్ణ హార్టీ కల్చర్ స్టూడియోలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus