డ్రగ్స్, వ్యభిచారాన్ని క్రిమినల్ జాబితాలోంచి తీసేయాలి.. నటి డిమాండ్!

  • October 9, 2021 / 05:08 PM IST

ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా భట్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు తమ సపోర్ట్ తెలపగా.. తాజాగా మరో సీనియర్ నటి సోమీ అలీ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

పిల్లలు డ్రగ్స్ వాడడమనేది సహజమని.. తనకిది పెద్ద విచిత్రంగా ఏం అనిపించడం లేదని చెప్పింది. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేమని.. అందుకే వాటిని క్రిమినల్ జాబితాలోంచి తొలగించాలని కోరింది. ఇక్కడ ఎవరు సాధువులు కాదని.. తను కూడా పదిహేనేళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. అంతేకాకుండా ‘ఆందోళన్’ సినిమా తీస్తున్న సమయంలో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేసినట్లు ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది.

ఇది బయటకు చెప్పడానికి ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేదని తెలిపింది. గతంలో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది సోమీ. రీసెంట్ గా కూడా సల్మాన్-సోమీ ఒక్కటి కానున్నారా..? అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus