చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ ఎనర్జీతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు.. 65 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ, తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తున్నారు.. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ విడుదల చేసి.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా బ్లాక్ బస్టర్ కొట్టారు.. ప్రస్తుతం ‘భోళా శంకర్’ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.. ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతోంది.. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా..

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.. మిల్కీ బ్యూటీ తమన్నా రెండోసారి జత కడుతుండగా.. కీర్తి సురేష్ చెల్లెలిగా, యంగ్ హీరో సుశాంత్ ఆమె భర్తగా కనిపించనున్నాడు.. ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.. ఇందులో అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారట.. చిరు ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఆ సాంగ్ ప్లాన్ చేయబోతున్నారట..

దీనిలో చిరు పక్కన చిందెయ్యడానికి కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించి.. ఎట్టకేలకు ఓ బాలీవుడ్ భామని ఫిక్స్ చేశారట.. ఆమె ఎవరో కాదు.. ‘చయ్య చయ్యా’ అంటూ కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన మలైకా అరోరా.. ఇంతకుముందు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో ‘కెవ్వు కేక’ అంటూ కాక పుట్టించిన మలైకా ఇప్పుడు చిరు పక్కన చిందులెయ్యబోతుంది.. ఈ పాట గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట..

కాస్త ఆలస్యం అయినా కానీ ‘భోళా శంకర్’ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారట చిరు.. ఎందుకంటే కథ నేపథ్యం కలకత్తాలో జరుగుతోంది.. తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మెమరబుల్ ఫిలింగా నిలిచిపోయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘చూడాలని ఉంది’ కథ కూడా కలకత్తాలోనే జరుగుతోంది.. ఇందులోనూ అదే ప్లేస్, బ్యాక్ డ్రాప్ కావడం అనేది సెంటిమెంట్‌గా కలిసి రావడమే కాక.. ఆ సినిమాలా ఇది కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు చిరు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus