Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

  • November 24, 2025 / 03:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. బాలీవుడ్ ‘హీమ్యాన్’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర (89) ఇక లేరు. మరికొద్ది వారాల్లో (డిసెంబర్ 8న) 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆయన, ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొన్నాళ్లుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. కానీ విధిరాత మరోలా ఉండటంతో తుదిశ్వాస విడిచారు.

Dharmendra

1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’తో ప్రయాణం మొదలుపెట్టిన ధర్మేంద్ర, సామాన్యుడి పాత్రల నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ‘షోలే’లో వీరూగా, ‘ధరమ్ వీర్’లో యోధుడిగా ఆయన చేసిన పాత్రలు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ వయసులో కూడా ఆయన ఖాళీగా లేరు. షాహిద్ కపూర్ ‘తేరీ బాతో మే..’ సినిమాలో కనిపించారు. అమితాబ్ మనవడు అగస్త్య నందాతో కలిసి నటించిన ‘ఇక్కీస్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. దురదృష్టవశాత్తు అదే ఆయన చివరి చిత్రంగా మిగిలిపోనుంది.

ధర్మేంద్ర కేవలం నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన తెలివైన వ్యాపారవేత్త. దాదాపు రూ. 335 కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించుకున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే, హాస్పిటాలిటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో ‘గరం ధరమ్’, కర్నాల్ హైవేపై ‘హీమ్యాన్’ పేరుతో రెస్టారెంట్లు, దాబాలు నడుపుతూ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా.

ముంబై నగర జీవనానికి దూరంగా, లోనావాలాలోని తన 100 ఎకరాల ఫామ్ హౌస్‌లో గడపడానికే ధర్మేంద్ర ఎక్కువగా ఇష్టపడేవారు. అక్కడ వ్యవసాయం చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో ఆక్వా థెరపీ తీసుకుంటూ ప్రకృతి ఒడిలో సేదతీరేవారు. ఇక కార్లంటే ఆయనకు మహా పిచ్చి. వింటేజ్ ఫియట్ నుంచి కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. ఇక ‘విజేత ఫిల్మ్స్’ బ్యానర్‌పై తన కొడుకులు సన్నీ, బాబీ డియోల్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఒక బలమైన పునాదిని వేశారు. ఒక సామాన్య రైతు బిడ్డగా వచ్చి, బాలీవుడ్ రారాజుగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharmendra

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version