ప్రభాస్ పక్కన నటించే అవకాశం ఆమె అందుకే కోల్పోయిందంట
- August 17, 2017 / 09:42 AM ISTByFilmy Focus
బాహుబలి చిత్రానికి కంటే ముందే ప్రభాస్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ. హీరోయిన్స్ అయితే అతని పక్కన నటించాలని ఆశ పడేవారు. బాహుబలి తర్వాత బాలీవుడ్ బ్యూటీలు సైతం ప్రభాస్ జోడిగా నటించాలని కలలు కన్నారు. అందుకే సాహో సినిమాలో హీరోయిన్ గా జరిగిన సెలక్షన్స్ లో పాల్గొన్నారు. ఆ ఛాన్స్ శ్రద్ధా కపూర్ ని వరించింది. సుజీత్ నిర్వహించిన హంట్ ముగిసింది. అయితే ఈ హంట్ లో పాల్గొన్నవారిలో చివరి వరకు వచ్చి అవకాశం కోల్పోయిన బ్యూటీ నిధి అగర్వాల్.
ఈమె దాదాపు హీరోయిన్ గా ఖరారు అని ప్రకటించే సమయంలో దురదృష్టం తలుపుతట్టింది. అదే టైమ్‌లో నిధి నటించిన సినిమా మున్నా మైఖేల్ సినిమా విడుదలై, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో డైరక్టర్ సుజీత్ ఆమెను పక్కన పెట్టారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అంతా ఫిక్స్ కావడంతో సాహో షూటింగ్ వేగవంతం కానుంది. ముంబయి లో కొన్ని సీన్స్ తెరకెక్కించిన అనంతరం సాహో టీమ్ దుబాయ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















