యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బహుబలి చిత్రంతో ఎనలేని క్రేజ్ వచ్చింది. పొరుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా డార్లింగ్ కి అభిమానులు ఏర్పడ్డారు. దీంతో అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ విస్తరించింది. బాహుబలి కంక్లూజన్ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నారు. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు. ఎక్కువ భాగం దుబాయి లో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రభాస్ చేసే సాహసాలు జేమ్స్ బ్యాండ్ ని తలపిస్తాయట.
అందుకోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని నియమించుకున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న సినిమాకు జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లను తీసుకోవాలని భావిస్తున్నారు. వీరు గతంలో “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే తెలుగు సినిమాకు సంగీతం అందించారు. వీరికున్న పాపులారిటీ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఐ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా, హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించనున్న ఈ మూవీ 2017 ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.