బాహుబలి కంక్లూజన్ సినిమా చూసి బాలీవుడ్ హీరో రియాక్షన్!
- May 16, 2017 / 01:50 PM ISTByFilmy Focus
మనదేశంలోని చిత్ర పరిశ్రమలంటిలో బాలీవుడ్ నంబర్ వన్ పరిశ్రమగా చెబుతుంటారు. ఎందుకంటే అక్కడే భారీ వ్యయంతో సినిమాలు తెరకెక్కుతుంటాయి. వారు రూపొందించిన సినిమాలకు ఎక్కువ కలక్షన్స్ వస్తుంటాయి. అమీర్ ఖాన్ నటించిన పీకే, దంగల్ సినిమాలు వెయ్యికోట్ల కలక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిచాయి. వాటన్నింటికంటే బాహుబలి కంక్లూజన్ 1500 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ వర్గాల ప్రముఖులను ఆశ్చర్యపరిచాయి.
తాజాగా ఈ సినిమాని చూసిన యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, యువ హీరో రణ్‌వీర్ సింగ్ లు తమ అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా తెలిపారు. ‘ఎట్టకేలకు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చూశా. విజయ అర్హత కలిగిన చిత్రమిది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇక రణ్‌వీర్ సింగ్ షాట్ అండ్ స్వీట్ గా ‘బాహుబలి… ఓ మైగాడ్’ అంటూ తన ఆశ్చర్యాన్ని బయటపెట్టారు. బాహుబలి సినిమాపై స్పందించినందుకు వీరిద్దరికి రాజమౌళి థాంక్స్ చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















