Boney Kapoor: అలర్ట్ అయిన హీరోయిన్ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?
- June 22, 2026 / 02:40 PM ISTByFilmy Focus Desk
జాన్వీ కపూర్ తెలుగులో రెండు వరుస సినిమాలు చేయడంతో.. మా దగ్గర ఎప్పుడు నటిస్తుంది అంటూ సౌత్ సినిమా పరిశ్రమల్లోని మిగిలిన భాషల అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే మోస్ట్ సెలబ్రేటెడ్ బాలీవుడ్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. సోషల్ మీడియాలో కానీ, హిందీ సినిమాల్లో కానీ ఆమెను చూసి కుర్రకారు తెగ ఆరాదిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా బాలీవుడ్‌లో గ్లామర్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమాలు పెద్దగా చేయలేదు. కానీ తెలుగులో మాత్రం అలాంటి సినిమాలే చేసింది.
Boney Kapoor
అయితే రీసెంట్ పరిణామాల నేపథ్యంలో ఆమె ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయి అని అంటున్నారు. నిజానికి వచ్చిన మార్పులు ఆమె దగ్గర కాదట.. తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దగ్గరట. ఇకపై జాన్వీ కపూర్ స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చూసుకుంటున్నారట బోనీ. ఆమె దగ్గర వచ్చే కథలు.. ముఖ్యంగా సౌత్ కథల విషయంలో ఇంకా జాగ్రత్తగా పాత్ర గురించి కనుక్కుంటున్నారట. అంతా ఓకే అనుకొని.. ఆ తర్వాత పాత్ర విషయంలో ఇబ్బందులు పడకూడదు అని అనుకుంటున్నారట.

‘దేవర’ సినిమా సమయంలో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా దాచిన బోనీ కపూర్.. స్వీట్ సర్‌ప్రైజ్ అంటూ టీమ్ ద్వారానే అనౌన్స్ చేయించారు. ఇక ‘పెద్ది’ సినిమా విషయంలో అయితే ఓపెనింగ్ ముహూర్తపు షాట్‌కి వచ్చింది కాబట్టి తెలిసిపోయింది. ఈ సమయంలో కోలీవుడ్‌లో అజిత్ హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఇంకా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమయంలో బోనీ కపూర్ డబుల్ చెక్ టాపిక్ రావడం గమనార్హం.
తొలుత ‘దేవర’ సినిమాలో ఆమె స్కిన్ షో, కొన్ని అనవసరపు డైలాగ్‌లు ఆమె పాత్ర చిత్రణ మీద ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో ఆ ప్రశ్నలు విమర్శలుగా మారాయి. ఆమె హర్ట్ అయింది అనే మాటలు కూడా బయటకు వచ్చాయి.














