Regena: బాలీవుడ్ హీరోయిన్లకు, కరణ్ జోహార్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన రెజీనా
- November 6, 2026 / 06:51 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్లో మాకు ఎన్ని భేదాభిప్రాయాలు అయినా ఉంటాయి.. కానీ టాలీవుడ్‌ని బయట పరిశ్రమ వాళ్లు ఎవరైనా ఏమైనా ఉంటే ఊరుకునేది లేదు అని అంటుంటాం. దీనినే మనం ‘టీఎఫ్ఐ కట్టుబానిస’ అనే సరదాగా పిలుచుకుంటూ ఉంటాం. ఇందులో సినిమా నటులు ఉన్నారా లేరా అనే డౌట్ మనకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్‌ని ఎవరైనా, ఏమైనా అంటే కొంతమంది నటులు రియాక్ట్ అవ్వరు. అయితే, ఇప్పుడు ఓ హీరోయిన్ మాట్లాడింది..
Regena
దీంతో మా మనసులోని మాటకు.. ఓ సెలబ్రిటీ వాయిస్ వచ్చింది అని టాలీవుడ్ అభిమానులు మురిసిపోతున్నారు. ఆ వాయిసే రెజీనా కసాండ్రా. తెలుగులో ఈ మధ్య కాలంలో సినిమాలు చేయని ఆమె.. అటు తమిళంలో సినిమాలు చేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఈ మొత్తం అనుభవం.. రీసెంట్ టాలీవుడ్‌ని నానా మాటలు అన్న బాలీవుడ్ హీరోయిన్ల సందర్భం తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.

గత కొన్ని ఏళ్లుగా రాధికా ఆప్టే, తాప్సీ.. టాలీవుడ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. దానికి బాలీవుడ్ దర్శకనిర్మాత, గొడవల స్పెషలిస్ట్ అయిన కరణ్ జోహార్ ఆధ్వర్యంలో జాన్వీ కపూర్ కూడా మొదలుపెట్టింది. ‘పెద్ది’ సినిమాలో ఆమె పాత్ర చిత్రణ గురించి బాధపడింది. ఇక రాధికా ఆప్టే అయితే మన కథలు, అందులోని పాత్రల రూపకల్పన గురించి ఎగతాళి చేసింది. వీటికి సమాధానంగా రెజీనా మాట్లాడుతూ.. ఎందుకంత యాగీ చేస్తున్నారు.. మిమ్మల్ని ఎవరైనా రే*ప్ చేశారా ఏంటి.. నచ్చక పోతే సినిమా నుండి బయటకు వచ్చేయొచ్చు కదా అని అడిగింది.
అంతేకాదు బాలీవుడ్‌కి వెళ్తున్న, వెళ్లిన హీరోయిన్లను ఎలా చూస్తారు అనే విషయమూ చెప్పింది. తాను కరణ్ జోహార్ నిర్మించిన ఓ సినిమాలో నటించానని.. అయితే ఆ సినిమా ప్రచారంలో తన ఫొటో కూడా లేకుండా చేశారని, అసలు ప్రచారానికే పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో పాత్ర నచ్చకపోతే అప్పుడు బయటకు వచ్చేంత ధైర్యం రాధికా ఆప్టే, జాన్వీ కపూర్‌కి ఉన్నాయని.. కానీ వారు అలా చేయకుండా కావాలని టాలీవుడ్‌ని తక్కువ చేశారు అని తన అభిప్రాయం తెలిపింది.















