శ్రీదేవి ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసిన బోనీ కపూర్

  • March 1, 2018 / 07:54 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. భారతీయ చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఒక గొప్ప నటిని కోల్పోయినందుకు చిత్ర ప్రముఖులు, అభిమానులు బాధపడుతున్నారు. ఇక ఆమె కుటుంబ పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులున్నా వాటిని పక్కన పెట్టి చిరునవ్వుతో ఒక భార్య గా, తల్లిగా ఇంటిని నడిపించిన తీరు ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు. శ్రీదేవి మరణం ఎటువంటి వ్యధని కలిగించనుందో.. ఆమె భర్త బోనీ కపూర్ అక్షరాల రూపంలో ఆవిష్కరించారు. అదికూడా శ్రీదేవి ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసి అభిమానులకు శ్రీదేవి ఇంకా మా, మీ మనస్సులో బతికేవుందని చెప్పారు. ఆ ట్వీట్ లో మనసుకు హత్తుకున్న విషయాలు ఏమిటంటే.. “శ్రీదేవి ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. మా బలం.

నా ప్రేమ.. నా స్నేహితురాలు.. భార్య.. ఇద్దరుకూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేనిది.” అని భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఆమె మరణం తర్వాత పరిస్థితిని వివరిస్తూ..” బాధాకర సమయంలో అర్జున్ కపూర్.. అన్షులు నా వెంట నిలబడ్డారు. వారు నాకూ.. జాన్వికి.. ఖుషికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నా ఇద్దరు కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోవటమే నాకున్న ప్రథమ కర్తవ్యం” అన్నారు. చివరగా వెండితెరపై శ్రీదేవి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందని.. భౌతికంగా ఆమె మన మధ్యన లేకున్నా..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లుగా బోనీ ట్వీట్ చేశారు. శ్రీదేవి అంత్యక్రియలుపూర్తి అయిన తర్వాత ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి వెలువడిన ఈ తొలి ట్వీట్ అభిమానుల కన్నీటిని తుడుస్తున్నట్టుగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus