స్టార్ హీరోల కాన్సెప్ట్‌లో కెరీర్‌లో ఎక్కువగా రెండేళ్లకో సినిమా చేస్తూ వస్తున్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన కెరీర్‌ని చూస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. రెండేళ్లకో సినిమాను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇతర దర్శకులు సినిమా తర్వాత సినిమా చేస్తూ వెళ్తుంటే.. ఆయన కొత్త కథను ఓకే చేసుకోవడానికి ఏడాది సమయం తీసుకుంటూ ఉంటారు. ఆ ఆలస్యానికి ఇదే కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమాతో ఇబ్బందికర ఫలితం అందుకున్న బోయపాటి శ్రీను.. ఏమైందో ఏమో ఎర్లీగా కొత్త సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈ క్రమంలో కొత్త కథలను, లైన్స్‌ని హీరోలకు చెప్పే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఓసారి ముంబయి ఫ్లయిట్ ఎక్కి కొంతమంది హీరోలకు కథలు చెప్పి వచ్చిన బోయపాటి.. ఇప్పుడు టాలీవుడ్ హీరోకి కథ చెప్పారు అని టాలీవుడ్ సమాచారం. ‘అఖండ 2: తాండవం’ ఫలితాన్ని త్వరగా మరచిపోవాలని బోయపాటి అనుకుంటుండటంతోనే ఈ కంగారు కథల నెరేషన్ అని చెబుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు బన్నీ కథ చెప్పాడు అంటున్న హీరో అల్లు అర్జున్. చేతిలో రెండు సినిమాలున్న బన్నీకి బోయపాటి కథ చెప్పడం కాస్త ఆశ్చర్యకరమే.
రణవీర్ సింగ్‌ని ఇటీవల కలిసిన బోయపాటి లైన్ చెప్పారని వార్తలొచ్చాయి. అయితే బోయపాటి ముంబయి వెళ్లి బన్నీని కలిశాడు అని అంటున్నారు. అట్లీ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలసి బోయపాటి కథ చెప్పారని ఓ వార్త టాలీవుడ్‌లో గింగిరాలు తిరుగుతోంది. కానీ అట్లీ తర్వాత సినిమా లోకేశ్ కనగరాజ్‌కి అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ లెక్కన బోయపాటి కథ ఓకే అయితే AA24 అవుతుంది.
ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి కోసం కూడా బోయపాటి ఓ స్క్రిప్టు రెడీ చేస్తున్నారని సమాచారం. బన్నీ, రణవీర్ సింగ్ కంటే.. రానా ఆ కథను మంచి ఆప్షన్ అని నమ్ముతున్నారట.