Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

నేటి తరం తమిళ అమ్మాయిలే కాదు.. ఇతర సౌత్‌ అమ్మాయిలు ఎవరినైనా సరే.. నీకు నచ్చే తమిళ హీరో ఎవరు అని అడిగితే.. ఫస్ట్‌ వచ్చే పేరు సూర్య. దానికి కారణం క్లాస్‌ లుక్‌లో అదిరిపోతుంటాడు. అలాగే ప్రేమ కథలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు కాబట్టి. మిగిలిన హీరోలకు మాస్‌ టచ్‌ కాస్త ఎక్కువ ఉండటం కూడా సూర్యకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండటానికి కారణం. ఆయన ఫ్యాన్స్‌లో నుంచి ఎవరైనా సౌత్‌ అమ్మాయి హీరోయిన్‌ అయితే.. ఆ కిక్కే వేరు.

Mamitha Baiju, Suriya

తాము స్కూల్లో, కాలేజీలో చదువుతున్నప్పుడు సూర్యను అక్కడ చూశాం, ఇక్కడ చూశాం, అప్పటి నుండి ఇష్టపడ్డాం, ఇప్పటి నుండి ఇష్టపడ్డాం అంటూ కథలు కథలుగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్‌ మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు వచ్చింది. సూర్యతో కలసి ఆమె నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా ప్రచారంలో భాగంగా మమిత ఇలాంటి విషయాలు చెబుతూ వస్తోంది. అలా సుమారు 11 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషయం చెప్పింది.

కేరళలోని ఓ లూలూ మాల్‌కి 2015లో ఓసారి సూర్య వచ్చాడట. ఆ సమయంలో మమిత ఎనిమిదో తరగతి చదువుతోంది. సూర్యను ఎలా అయినా కలుద్దాం అని ట్రై చేసి ఇంట్లో చెప్పిందట. చిన్న పిల్ల కదా అని అప్పుడు ఇంట్లో వాళ్లు ఆ జనాల మధ్యలోకి వెళ్లడానికి ఒప్పుకోలేదట. కానీ ఆమె బ్రదర్‌, అతని ఫ్రెండ్స్‌ వెళ్లి కలిశారట. ఫొటోలు కూడా దిగారట. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా మమితకు కోపం వచ్చేదట.

కానీ ఇప్పుడు ఏకంగా సూర్యతో కలసి నటిస్తున్నాను. ఇదే కదా లైఫ్‌లో ఫుల్‌ సర్కిల్‌ అంటే అంటూ చెబుతూ మురిసిపోయింది మమిత. అంతేకాదు ఆ రోజు మిస్‌ అయిన లూలూ మాల్‌లోనే ఇప్పుడు ఆయన పక్కన కూర్చున్నాను. ఆయనతో కలసి నటించాను అంటూ మురిసిపోయింది మమితా బైజు. ఎంతైనా మమితా అదృష్టవంతురాలు కదా.

అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus