పదేళ్ల కెరీర్ లో తీసింది ఆరు సినిమాలే. అయితే తనదంతా మాస్.. ఊరమాస్ అని చెప్పుకుంటారు బోయపాటి శ్రీను. సింహ, తులసి, లెజెండ్ లాంటి సినిమాలతో సీనియర్ హీరోలకే పరిమితం అవుతున్నాడన్న ముద్రను ‘సరైనోడు’తో చెరపాలనుకున్నారు. టాక్ తో సంబంధం లేకుండాస్ కలెక్షన్లు అదుర్స్ అంటూ వీర ప్రచారం చేసి ముచ్చట తీర్చుకున్నారు. సరే.. కానీ బోయపాటి తర్వాతి కథేమిటి అన్నది ప్రస్తుతం ప్రశ్న.
బన్నీ సినిమాకి ముందే బెల్లంకొండ వారి తనయుడు శ్రీనివాస్ తో బోయపాటి సినిమా లాక్ అయిపోయింది. ‘సరైనోడు’ తర్వాత సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పినా సినిమా విడుదలై అయిదు నెలలు కావస్తోంది. అయినా కదలిక లేదు. పోనీ శ్రీనివాస్ ఏమైనా ‘స్పీడ్’మీదుండి బోయపాటి వారికి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నాడా అంటే అదీలేదాయే. లోపల ఏం జరుగుతున్నది బయటకి తెలీడం లేదు. మరోవైపు ఎన్టీఆర్-బోయపాటి కాంబినేషన్ చర్చకు వచ్చింది. ఇది కుదరాలన్నా బెల్లంకొండ పర్మిషన్ ఇవ్వాలి. ఈ కథ ఎటు టర్న్ తీసుకుంటుందో మరి..!