Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

టాలీవుడ్ వెండితెరపై హీరో ఎలివేషన్లకు ఒక కొత్త అర్ధాన్ని ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాక్సాఫీస్ దగ్గర సౌండ్ ఎలా ఉండాలో, ఫ్యాన్స్ కు పూనకాలు ఎలా తెప్పించాలో ఆయనకు తెలిసినట్లు మరెవరికీ తెలియదు. సీట్లలో కూర్చున్న ఆడియన్స్ కు రోమాలు నిక్కబొడుచుకునేలా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేయడంలో ఆయన మాస్టర్. అందుకే మాస్ ఆడియన్స్ లో బోయపాటి సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

Boyapati Srinu

అయితే బోయపాటి అంటే కేవలం గాల్లో ఎగిరే సుమోలు, నరుక్కోవడాలే కాదు.. ఆయనలో ఒక క్లాస్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. తొలి సినిమా ‘భద్ర’లో రవితేజతో కలిసి లవ్ అండ్ యాక్షన్‌ను పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు. అలాగే వెంకటేష్‌తో తీసిన ‘తులసి’ చిత్రంలో యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్లే ఆడియన్స్‌ను ఎక్కువగా కదిలించాయి. ఈ రెండు సినిమాలు బోయపాటిలోని ఎమోషనల్ యాంగిల్‌ను చాలా గొప్పగా ప్రజెంట్ చేశాయి.

కానీ నందమూరి బాలకృష్ణతో చేసిన ‘సింహా’ మూవీ నుంచి అఖండ 2 వరకు బోయపాటి రూటు కంప్లీట్ మాస్ వైపు మళ్ళిపోయింది. లెక్కకు మించి ఫైట్లు, భారీ విలన్ల వేట ఉండటంతో ఆయనలోని సున్నితమైన కథా రచయిత కొంచెం వెనక్కి తగ్గాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్ర, తులసి సినిమాల్లో ఉన్నట్టుగా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీలు ఇప్పుడు ఆయన సినిమాల్లో మిస్ అవుతున్నాయని ఫ్యాన్స్ నుంచి వస్తున్న టాక్.

నిజానికి బోయపాటి తన రెగ్యులర్ రివెంజ్ డ్రామాల నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాత సినిమాల తరహాలో ఎమోషనల్ కథలు రాస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆయన మార్క్ యాక్షన్‌కు మంచి ఫ్యామిలీ డ్రామా తోడైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం ఖాయం. ఒకే ఫార్మాట్‌లో కాకుండా, కొత్త తరహా కథలతో ఆడియన్స్‌ను సర్ ప్రైజ్ చేయాల్సిన అవసరం ఆయనపై ఎంతైనా ఉంది. డైరెక్టర్‌గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న బోయపాటి శ్రీను, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అగ్ర హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, బోయపాటి ఏ హీరోతో తన నెక్స్ట్ మాస్ సినిమాను ప్లాన్ చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా భద్ర నాటి బోయపాటిని ఫ్యాన్స్ మళ్ళీ వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus