తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా రామ్ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అతని కెరీర్ ఎంతో సప్పగా సాగిపోతున్న క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్క సారిగా తనలో ఉన్న మాస్ క్యారెక్టర్ బయటపెట్టారు. దీంతో అప్పటి నుంచి రామ్ మాస్ యాక్షన్ సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం పొందిన తర్వాత రెడ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో రామ్ మొదటిసారిగా ద్విభాషా చిత్రమైన ది వారియర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తికావడంతో రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన జర్నీ ప్రారంభించారు.అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బోయపాటి తన తదుపరి చిత్రాన్ని రామ్ తో చేయనున్నారు.ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.
ఈ క్రమంలోనే బోయపాటి హీరో రామ్ తో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు ఎంతో ఘనంగా ప్రారంభించారు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇకపోతే నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ రామ్ ది వారియర్ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని తన బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.