ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

నిజానికి తెలుగు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లో ఓ హీరోయిన్ ప్రెజెంట్లో ఓ హీరోయిన్ ఉండడం చాలా జనరేషన్స్ నుండీ చూస్తూనే వస్తున్నాం. ఒకే హీరో డబుల్ రోల్ చేయడం.. అయితే హీరోయిన్లు వేరే వాళ్ళు ఉండడం.. అది కూడా స్టార్ హీరోయిన్లు ఉండడం మనం చాలానే చూశాం. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే అది మల్టీస్టారర్ అంటారు. అదే ఇద్దరు హీరోయిన్లు కలిసి ఓ సినిమాలో నటిస్తే మాత్రం.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అని మాత్రమే అంటుంటారు. సరే ఈ విషయాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి కానీ.. కొంతమంది హీరోయిన్లు రిపీటెడ్ గా కొన్ని సినిమాల్లో నటించారు.

ఉదాహరణకి చెప్పాలంటే… అప్పట్లో అయితే రోజా- మీనా, రమ్యకృష్ణ- సౌందర్య, విజయ శాంతి – రాధా లాంటి కాంబోల్లా అన్న మాట. అలానే పలు సినిమాల్లో హీరోయిన్ల కాంబోలు రిపీట్ అయ్యాయి. అవి ఏ సినిమాల్లోనో.. ? ఏ హీరోయిన్ల కాంబోలు రిపీట్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్తి అగర్వాల్ – సోనాలి బింద్రే :

చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో.. అలాగే బాలకృష్ణ నటించిన ‘పలనాటి బ్రహ్మనాయడు’ సినిమాలో వీళ్ళు నటించారు. ఈ రెండు చిత్రాలకి బి.గోపాలే దర్శకుడు కాబట్టి ఈ కాంబోలు రిపీట్ అయినట్టు స్పష్టమవుతుంది.

2) శ్రీయ – జెనీలియా :

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నా అల్లుడు’, వెంకటేష్ నటించిన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాల్లో వీళ్ళు నటించారు.

3) కాజల్ అగర్వాల్- నిత్యా మేనన్ :

‘అ!’ ‘అదిరింది’ వంటి సినిమాల్లో ఈ ఇద్దరు భామలు నటించారు.

4) కాజల్ అగర్వాల్ – శ్రద్దా దాస్ :

అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’, ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ చిత్రాల్లో వీళ్ళు నటించారు.

5) కాజల్ అగర్వాల్- తాప్సి పన్ను :

ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో అలాగే రవితేజ హీరోగా నటించిన ‘వీర’ సినిమాలో ఈ భామలు నటించారు.

6) కాజల్ – సమంత :

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బృందావనం’, మహేష్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’, విజయ్ హీరోగా నటించిన ‘అదిరింది’ సినిమాలో ఈ భామలు నటించారు.

7) సమంత- నిత్యా మేనన్ :

జబర్దస్త్, సన్ ఆఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, 24 వంటి సినిమాల్లో ఈ భామలు నటించారు.

8) సమంత – ప్రణీత :

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రభస’ చిత్రాల్లో ఈ భామలు నటించారు.

9) తమన్నా- మెహ్రీన్ :

వెంకటేష్- వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ అలాగే దాని సీక్వెల్ ‘ఎఫ్3’ వంటి సినిమాల్లో ఈ భామలు నటించారు.

10) పూజా హెగ్డే – ఈషా రెబ్బా :

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ లో అలాగే అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో ఈ భామలు నటించారు.

11) సమంత- కీర్తి సురేష్ :

‘మహానటి’ మరియు ‘మన్మధుడు2’ చిత్రాల్లో ఈ భామలు నటించారు.

Share.