అనూహ్యంగా బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా గురించి చర్చ మొదలైంది. అతని నెక్స్ట్ మూవీ ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో అని అనౌన్స్మెంట్ వచ్చింది. అంతే ఇది కచ్చితంగా బన్నీతోనే అని అంతా ఫిక్స్ అయిపోయారు. ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా బన్నీ వెళ్ళినప్పుడు.. బోయపాటితో సినిమా పై కూడా గట్టిగా చర్చలు జరిగాయి. సో బన్నీ – బోయపాటి కాంబో ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు. గతంలో ఈ కాంబోలో ‘సరైనోడు’ సినిమా వచ్చింది.
అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అభిమానులు కూడా ఈ కాంబోలో ఇంకో మూవీ రావాలని కోరుకుంటున్నారు. అయితే బన్నీ ఇప్పుడు ఖాళీగా లేడు. ‘పుష్ప 2 ‘ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 6 నెలల టైం పడుతుంది. డిసెంబర్ నుండి త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు అని ఇన్సైడ్ టాక్. మరి బోయపాటి సంగతేంటి? అంటే అతనికి నెక్స్ట్ ఆప్షన్ సూర్య. తమిళ స్టార్ హీరో సూర్య .. ‘గీతా ఆర్ట్స్’ లో ఒక సినిమా చేయాలి.
అతని ‘గజినీ’ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి సూర్యకి మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది ‘గీతా ఆర్ట్స్’ సంస్థ. కాబట్టి.. ఆ టైంలోనే సూర్య ఈ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి సైన్ చేసాడు. సూర్య డేట్స్ ‘గీతా’ వారి వద్ద ఉన్నాయి. కానీ అతను కూడా ‘కంగువా’ సినిమాని కంప్లీట్ చేయాలి. అందుకే బోయపాటి శీను (Boyapati Srinu) నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది.