Bro Collections: ‘బ్రో’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే

  • July 29, 2023 / 12:01 PM IST

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 8.25 cr
సీడెడ్ 2.65 cr
ఉత్తరాంధ్ర 2.53 cr
ఈస్ట్ 2.45 cr
వెస్ట్ 2.98 cr
గుంటూరు 2.46 cr
కృష్ణా 1.20 cr
నెల్లూరు 0.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.05 cr
 ఓవర్సీస్ 4.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 29.54 cr (షేర్)

‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటిరోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా రూ.29.54 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.68.96 కోట్ల షేర్ ని రాబట్టాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus