Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

చిరంజీవితో బుచ్చిబాబు సానా సినిమా.. మాట అనగానే చాలామంది ఫక్కున నవ్వారు. కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇంకొంతమంది అయితే ‘ఈసారి ఏం కట్‌ చేస్తారో’ అంటూ జోకులేసుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల సమాచారం చూస్తుంటే.. ఆ జోకులు, నవ్వులు అన్నీ వేస్ట్‌ అవుతాయనిపిస్తోంది. ఎందుకంటే బుచ్చిబాబు చెప్పిన సినిమా కథకు చిరంజీవి ఓకే చెప్పారు అని లేటెస్ట్‌ సమాచారం.

Chiranjeevi – Buchibabu

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కి ఓ నిర్మాణ సంస్థ కూడా దొరికిందట. త్వరలో ఈ మేరకు అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మేరకు బుచ్చిబాబు సానా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో పడ్డారట. చిరంజీవి పచ్చ జెండా ఊపగానే ఆ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ గురించి టీజర్లు ఇవ్వడం స్టార్ట్‌ చేస్తుందట. అయితే ఆ నిర్మాణ సంస్థతోపాటు మరో బ్యానర్‌ కూడా యాడ్‌ అవుతుందని చెబుతున్నారు.

ఇదంతా ఓకే కానీ.. ‘పెద్ది’ లాంటి డివైట్‌ టాక్‌ వచ్చిన సినిమాను తీసి..చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ బుచ్చిబాబు ఎలా సంపాదించారు అనే డౌట్‌ ఉంఆ? ‘పెద్ది’ సినిమా గురించి హీరో రామ్‌చరణ్‌ కంటే ఎక్కువ నమ్మింది, ఎక్కువగా ప్రచారం చేసింది, ఎక్కువగా మాట్లాడింది దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆ సినిమా గురించి ఆయన మాటలు విన్నాక.. ఆ కథ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థమైంది. కానీ సినిమా వచ్చాక కథ పక్కకు వెళ్లిపోయి ఇతర అంశాలు ముందుకొచ్చి సినిమా ఫలితాన్ని ఎంజాయ్‌ చేయకుండా చేశాయి. సినిమాలో ఉన్న లోపాల కంటే మిగిలిన అంశాలను పాపాలుగా చూపించి బుచ్చిబాబు మొరాల్‌ను డౌన్‌ చేసేశారు.

కానీ ఆ తర్వాతి పరిస్థితుల నుండి కోలుకున్న బుచ్చిబాబు సానా.. ఇప్పుడు మూడో సినిమా పనులు షురూ చేశారు. ‘పెద్ది’ లాంటి ప్రయోగం కాకుండా ఫక్తు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేద్దాం అని అనుకుంటున్నారట. ‘పెద్ది’ ఫలితం గురించి ఆలోచించకుండా ఆయన టేకింగ్‌ని నమ్మి ఛాన్స్‌ ఇస్తున్నారట. శ్రీకాంత్‌ ఓదెల సినిమా తర్వాత చిరంజీవి చేయబోయేది బుచ్చిబాబు అని చెబుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి యంగ్‌ డైరెక్టర్లను సినిమా ఛాన్స్‌లు ఇవ్వడంలో చిరంజీవి ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం బాబీ డైరక్షన్‌లో చేస్తున్న ‘కాకా’ కానీ, చేసేసిన మల్లిడి వశిష్ట ‘విశ్వంభర’ కానీ, చేయనున్న శ్రీకాంత్‌ ఓదెల సినిమా కానీ ఇలాంటివే కావడం గమనార్హం. అంటే బుచ్చిబాబుకు ఛాన్స్‌ ఉంది. అయితే వెంకీ కుడుమలలా కథతో నిరాశపరచకుండా ఉంటేనే ఈ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెప్పొచ్చు.

30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus