Ram Charan: బుచ్చిబాబుకు అంత తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారా?

  • December 20, 2022 / 02:49 PM IST

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్నట్టు అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చరణ్ కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. చరణ్ కు ఈ సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కనుందని తెలిసి ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. అయితే బుచ్చిబాబుకు మాత్రం తక్కువ రెమ్యునరేషన్ దక్కనుందని తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ స్థాయిలో హ్యాండిల్ చేశారు.

సుకుమార్ సైతం తన శిష్యులలో ఇతర శిష్యుల కంటే బుచ్చిబాబుపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. బుచ్చిబాబుకు నిర్మాతలు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తమే అయినా హీరో రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే చాలా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ తో తీసే సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ కు బుచ్చిబాబు చెప్పిన కథ చాలా నచ్చేసిందని ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని సమాచారం. చరణ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరోల మధ్య కూడా గట్టి పోటీ ఉందనే సంగతి తెలిసిందే. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో చరణ్ నంబర్ 1 స్థానంలో నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చరణ్ మరింత కష్టపడితే నంబర్1 స్థానాన్ని సొంతం చేసుకోవడం కష్టం కాదు. రాబోయే రోజుల్లో చరణ్ ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. చరణ్ కు రెమ్యునరేషన్ తో పాటు క్రేజ్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus