వరుస ప్లాపులు…భారీ బడ్జెట్ పెడుతూ రిస్క్ చేస్తున్నారా?

విజయ్ దేవరకొండ రెండేళ్ల క్రితం ‘గీత గోవిందం’ అనే చిత్రంతో 70 కోట్ల షేర్ ను రాబట్టాడు. దీంతో తరువాతి సినిమాలకు స్టార్ హీరో రేంజ్ కు చేరుకుంటాడు అని అంతా భావించారు. కానీ కట్ చేస్తే అతని మార్కెట్ పడిపోతూనే వస్తుంది. ఆ తరువాత వచ్చిన ‘నోటా’ చిత్రం జస్ట్ 13 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్లాపయ్యింది కాబట్టి అంత చాలా ఎక్కువ అని సరిపెట్టుకున్నారు. ‘టాక్సీవాలా’ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఆ చిత్రానికి 22 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇక ‘డియర్ కామ్రేడ్’ చిత్రం 21 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. చెప్పాలంటే ఓ మీడియం రేంజ్ హీరోకి ఇవి చాలా ఎక్కువ కలెక్షన్లే అయినప్పటికీ.. ఆ చిత్రానికి 30 కోట్ల పైనే బిజినెస్ జరిగింది కాబట్టి ఆ కలెక్షన్లు తక్కువనే చెప్పాలి. ఇక ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రమైతే కనీసం 10 కోట్ల షేర్ ను దాటడానికి అష్టకష్టాలు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన తరువాతి సినిమాకి బడ్జెట్ కోతలు ఉంటాయని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే.. విజయ్ హీరోగా పూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి ఏకంగా 50 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఓ మీడియం రేంజ్ హీరోకి అంత పెట్టడం అంటేనే చాలా రిస్క్.. అందులోనూ అతను వరుస ప్లాపుల్లో ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత పెట్టడం అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకున్నారు. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి 50 కోట్ల బడ్జెట్ అంటే తక్కువే. అందులోనూ కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ అగ్ర నిర్మాత ఉన్నాడు కాబట్టి.. అక్కడ మార్కెట్ చేసుకోవడం చాలా ఈజీ. ఛార్మి మరో నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక పూరి కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్ అందుకుని ఫామ్ల్లోకి వచ్చాడు కాబట్టి.. ఒకవేళ తేడా కొట్టినా ప్రాబ్లెమ్ ఉండదు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus