బన్నీ…లింగుస్వామిని ఎందుకు “నో” చెప్తున్నాడు!!

  • March 1, 2016 / 07:43 AM IST

తమిళ టాప్ దర్శకుడు లింగుస్వామి చాలా ట్యాలెంటెడ్. తమిళ్ లో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు సూర్యతో చేసిన ‘సికింధర్’ పుణ్యమా అంటూ తన క్రేజ్ మొత్తం కోల్పోయాడు. అయితే మరో పక్క ఆయనకు తెలుగులో, తెలుగు హీరోతో సినిమా చెయ్యాలనే ఆలోచన బలంగా ఉండడంతో కొన్నాళ్ళు కధ పట్టుకుని ప్రిన్స్ మహేష్ చుట్టూ తిరగగా మనవాడు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక అటుపై పవర్ స్టార్ ను సైతం కలిసే ప్రయత్నం చేయగా అక్కడకూడా నో అనే పదమే వినిపించడంతో చేసేది ఏమీ లేక చెర్రీ దగ్గరకు సైతం వెళ్లాడు, చెర్రీ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అయితే అదే కోవలో తనతో బన్నీ సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలియడంతో హుటాహుటిన బన్నీ కాంపౌండ్ లో వాలిపోగా తొలుత బన్నీ ఓకే చెప్పేసాడు. కానీ ఆ తరువాతే అసలు కధ మొదలయ్యింది. బన్నీతో సినిమా ఉంది అన్న ఆనందంలో లింగుస్వామి ‘పందెంకోడి 2’ను సైతం వదిలేసుకుని బన్నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సమయంలో బన్నీ లింగుస్వామిని తప్పుంచుకుని తిరుగుతూ, కలవడానికి అవకాశం ఇవ్వడంలేదంటా…ఇంతకీ బన్నీ ఎందుకు అలా చేస్తున్నాడు అంటే సరైనోడు తర్వాత వెంటనే మరో మాస్‌ సినిమా చేయడం కరెక్ట్‌ కాదు కాబట్టి లింగుస్వామి ప్రాజెక్ట్‌ వాయిదా వేయాలని చూస్తున్నాడట.

అయితే సరైనోడు సినిమా తరువాత బన్నీ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం, పైగా బన్నీతో ఇమ్మీడియట్‌గా సినిమా చేయడానికి నమ్మదగ్గ దర్శకులు దొరక్కపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల బన్నీ లింగుస్వామిని తప్పించుకునే ప్రయత్నంలో అర్జంటుగా ఏదో ఒక సినిమా అనౌన్స్‌ చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాపం లింగు స్వామి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus