Ravanasura: రెండు విధాలుగా కూడా ‘దసరా’ వల్ల ‘రావణాసుర’ కి దెబ్బ పడే ఛాన్స్ ఉందట..!

  • April 5, 2023 / 01:17 PM IST

ఈసారి సమ్మర్ సీజన్ కు పెద్ద సినిమాల సందడి లేదు. మార్నింగ్ షోలు, థియేటర్ల ముందు అభిమానుల పడిగాపులు వంటివాటికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈసారి పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కావడం లేదు. అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. పరీక్షల సీజన్ వల్ల కూడా చాలా సినిమాలు సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. అన్నీ ఎలా ఉన్నా.. అనుకున్న డేట్ కు అంటే మార్చ్ 30 న నాని నటించిన ‘దసరా’ రిలీజ్ అయ్యింది.

సినిమా మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ భారీగా నమోదవుతున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ బుకింగ్స్ ఉన్నాయి. మరోపక్క ‘రావణాసుర’ కూడా రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 7 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ‘రావణాసుర’ సినిమాకి హైప్ ఏమీ లేదు. పెద్దగా బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ‘మీటర్’ అనే మరో సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది.

ఆ సినిమాతో ‘రావణాసుర’ (Ravanasura) కి పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఎటొచ్చి.. పాజిటివ్ టాక్ రాకపోతే కనుక ‘దసరా’ తోనే పెద్ద ప్రాబ్లమ్. రెండో వీకెండ్ కూడా ఆ మూవీకే షోలు పెరిగిపోతాయి. ‘రావణాసుర’ కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడినట్టు అవుతుంది. పాజిటివ్ టాక్ వచ్చినా ‘దసరా’ ఎఫెక్ట్ ఉండొచ్చు.. కానీ తక్కువలో అన్న మాట..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus