Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?
- April 22, 2026 / 04:53 PM ISTByPhani Kumar
వంశీ పైడిపల్లి సక్సెస్ఫుల్ దర్శకుడే.. కానీ అతని కథల పై ఎప్పుడూ కొన్ని విమర్శలు ఉంటాయి. పాత సినిమాలను అటు తిప్పి.. ఇటు తిప్పి తీసేస్తాడు అనే రిమార్క్ ఇతనిపై ఉంది. ‘మున్నా’ సినిమాని తీసుకుంటే.. అది వెంకటేష్ ‘సూర్య ఐ పి ఎస్’ స్ఫూర్తితో రూపొందిన సినిమా అంటారు.
Salman Khan
‘బృందావనం’ అయితే జగపతి బాబు ‘అల్లుడు గారు వచ్చారు’, ‘ఎవడు’ అయితే ‘ఛత్రపతి’ ‘విక్రమార్కుడు’ ‘జర్నీ’ , ‘మహర్షి’ ని తీసుకుంటే ‘శ్రీమంతుడు’ ‘3 ఇడియట్స్’ ‘సర్కార్’ వంటి సినిమాలని మిక్స్ చేసినట్లు ఉంటుంది. ‘వారసుడు’ కూడా ఆల్మోస్ట్ ఇంతే..! కొద్దోగొప్పో ‘ఊపిరి’ కి కాస్త మంచి ఒపీనియన్ ఉంది. అది కూడా రీమేక్ సినిమా అయినప్పటికీ.. వంశీ ఓన్ చేసుకుని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఆ నమ్మకాన్ని తర్వాతి సినిమాలతో నిలబెట్టుకోలేకపోయాడు వంశీ పైడిపల్లి.

ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. కొంత కాలంగా టాలీవుడ్ దర్శకులు పరభాషా హీరోలతో చూస్తూనే ఉన్నాం. అలాగే బాలీవుడ్ దర్శకులు కూడా టాలీవుడ్ మేకర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ వంటి వెయ్యి కోట్ల మార్కెట్ కలిగిన స్టార్ హీరో రేంజ్ కి తగ్గట్టు వంశీ పైడిపల్లి సినిమా చేయగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అలాగే సల్మాన్ ఖాన్ కూడా డే టైంలో షూటింగ్ కి హాజరుకాడు. ఇవన్నీ దర్శకుడు వంశీ పైడిపల్లి ముందున్న సవాళ్ళు. అయితే వంశీకి ఉన్న అడ్వాంటేజులు ఏంటంటే.. సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాలంలో ఫామ్లో లేడు. నార్త్ ఆడియన్స్ కూడా మన రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాలంటే పడి చస్తారు. సో ఇక్కడ ఏదో ఒక కథను తీసుకుని అటు తిప్పి.. ఇటు తిప్పి తీశాడు అంటే.. వంశీ పైడిపల్లి గట్టెక్కేసినట్టే..!











