బిగ్ బాస్ 4: రంగు టాస్క్ లో గెలిచిన ‘అమ్మ’..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ -4 ఇప్పుడు 9వ వారం నుంచి ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. రింగులో రంగు టాస్క్ లో అమ్మరాజశేఖర్ మాస్టర్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇది స్పష్టంగా బిగ్ బాస్ చూపించేశాడు. కెప్టెన్ గా అమ్మరాజశేఖర్ హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు. కెప్టెన్ అవ్వగానే ఒక మీటింగ్ పెట్టి హౌస్ మేట్స్ కి వర్క్ డివైడ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మెహబూబ్ కి అండ్ అవినాష్ కి బాత్రూమ్ వర్క్ అప్పజెప్పాడు. దీనిపై సోహైల్ అబ్జక్ట్ చేశాడు.

అక్కడే మెహబూబ్ ఆనందపడుతుంటే, హారిక అపోజ్ చేసింది. ఇక టోటల్లీ ఇది నా డెసీషన్ చేయాలనుకుంటే చేయి., లేదంటే లేదు అంటూ మాస్టర్ సోహైల్ తో తేల్చి చెప్తున్నాడు.అంతేకాదు, ఇక్కడ హారిక కూడా నేను చేయను అంటూ సీరియస్ గానే చెప్తోంది. అభిజిత్ కూడా ఇక్కడ మాస్టర్ తో కూల్ గా మాట్లాడుతున్నాడు. అవతల వాళ్లు చెప్పింది ఒక్కసారి వినాలి అంటూ మాస్టర్ కి సలహా ఇస్తున్నాడు. కానీ, ఫుల్ ఫైర్ లో ఉన్న మాస్టర్ ఇవేమీ పట్టించుకోవట్లేదు.

హారిక తన ప్రాబ్లమ్ ని అవినాష్ అండ్ అరియానాలిద్దరికీ చెప్పుకుంటోంది. అంతేకాదు, హారిక కూడా ఫుల్ సీరియస్ గానే ఉంది. ప్రోమోలో చూసినట్లయితే సోహైల్ మెహబూబ్ పైన అరుస్తుంటే అఖిల్ అభిజిత్ ని సముదాయిస్తున్నాడు. ఇక్కడే బిగ్ బాస్ అభిజిత్ ని తెలుగులో మాట్లాడాలని ఎనౌన్స్ చేయగానే అమ్మరాజశేఖర్ కసి తీర్చుకున్నట్లుగా బిహేవే చేశాడు. అంతేకాదు, ఇక పైన మీ ఫ్రెండ్షిప్ లు వద్దు, మీవి ఏమీ వద్దు అని మెహబూబ్ చెప్తుంటే సోహైల్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు.

నేలకేసి కొడుతూ రెచ్చిపోయాడు. ఇక ప్రోమో చివర్లో చంద్రముఖిలో రాజా రజనీకాంత్ నవ్వుతూ నడుస్తూ వెళ్తున్నట్లుగా ఒక మానసిక ఆనందంతో నడుస్తూ అమ్మరాజశేఖర్ వెళ్లడం అనేది ఆసక్తికరంగా చూపించారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి తన కెప్టెన్సీలో చుక్కలు చూపిస్తున్నారు అమ్మరాజశేఖర్. మరి దీనిపై నాగార్జున వీకెండ్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

 

 

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus