Captain Collections: మొదటి రోజు సో సో ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘కెప్టెన్’

  • September 9, 2022 / 07:43 PM IST

కోలీవుడ్ హీరో ఆర్య ‘వరుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు! అటు తర్వాత ‘నేనే అంబానీ’ ‘ఆట ఆరంభం’ ‘వాడు వీడు’ ‘రాజా రాణి’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అతను హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్’. సెప్టెంబర్ 8 న(నిన్న) రిలీజ్ అయిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అలాగే హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ మధ్యనే సుధాకర్ రెడ్డి రిలీజ్ చేసిన తమిళ చిత్రం ‘విక్రమ్’ ఘన విజయం సాధించడంతో ‘కెప్టెన్’ పై కూడా బయ్యర్స్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ మొదటి రోజు టాక్ తేడా కొట్టడంతో బుకింగ్స్ పెద్దగా నమోదు కాలేదు కానీ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.18 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.07 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.65 cr

‘కెప్టెన్’ చిత్రానికి రూ.1.61 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పలు ఏరియాల్లో సుధాకర్ రెడ్డి ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.65 కోట్ల వరకు షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.

కానీ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ‘ఒకే ఒక జీవితం’ ‘బ్రహ్మాస్త్రం’ వంటి క్రేజీ సినిమాలు ఈరోజు రిలీజ్ అవుతుండడంతో వాటి ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్ల పై పడినట్టు స్పష్టమవుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus