సుష్మితతో గొడవ గురించి స్పందించిన కేథరిన్

  • August 8, 2017 / 02:43 PM IST

దుబాయ్ బ్యూటీ కేథరిన్ కన్నడ, మలయాళ సినిమాల మీదుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. చమ్మక్ చల్లో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈమె “ఇద్దరమ్మాయిలతో” అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తో జత కట్టింది. సరైనోడులో ఎమ్మెల్యే గా అదరగొట్టింది. ఇలా మెగా హీరోతో ఉన్న పరిచయంతో ఖైదీ నంబర్ 150 లో అవకాశం పట్టేసింది. రత్తాలు రత్తాలు సాంగ్ లో చిరు తో కలిసి స్టెప్పులు వేయడానికి సిద్ధమైంది. కానీ ఆ చిత్రానికి స్టైలిస్ట్ గా పనిచేసిన చిరు కుమార్తె సుష్మితతో కొంత గొడవ రావడంతో సినిమా నుంచి బయటికి వచ్చింది. ఆమెకి తల బిరుసనే ప్రచారం జోరందుకుంది. ఇక టాలీవుడ్ నుంచి కేథరిన్ వెళ్లిపోతుందేమో అని అందరూ అనుకుంటుండగా.. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

‘గౌతమ్ నంద’ లో అలరించిన కేథరిన్ ‘నేనేరాజు.. నేనే మంత్రి” సినిమాలో రెండో హీరోయిన్ నటించింది. “జయ జానకి నాయక’ లో ఐటం సాంగ్ చేసింది. ఈ సినిమాలు మూడురోజుల్లో థియేటర్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అప్పటి గొడవ గురించి నోరు విప్పింది. “ఖైదీ నంబర్ 150 నుంచి బయటికి వచ్చిన మాట వాస్తవమే. సుష్మితతో కాస్ట్యూమ్ ఇష్యూ పై నో కామెంట్” అని చెప్పింది. ఈ మాట విన్న సినీ విశ్లేషకులు  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా ఉండాలో కేథరిన్ నేర్చుకుందని అంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus