Catherine, Pushpa2: కేథరిన్‌ను తీసుకొచ్చి.. కొత్తగా చూపించి!

  • November 22, 2022 / 09:19 AM IST

‘ఇద్దరమ్మాయిలతో’లో అల్లు అర్జున్‌ను ఆటపట్టించి, ఆ తర్వాత అదంతా ఆయనేసిన ప్లాన్‌ అని తెలుసుకున్న అమ్మాయి గుర్తుందా? ‘ఎంఎల్‌ఏ’ అంటూ ‘సరైనోడు’లో అల్లు అర్జున్‌ వెంటపడీపడీ సందడి చేస్తుంటే.. ఏమీ చేయలేక గింజుకున్న అమ్మాయి గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయికి అల్లు అర్జున్‌కి విలన్‌గా మారబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎర్రచందనం స్మగ్లర్‌ ‘పుష్ప’రాజ్‌ రెండో పార్ట్‌లో ఆ లవ్లీ ఏంజెల్‌తో తలపడబోతున్నాడట. ‘ఇద్దరమ్మాయిలతో’తో సినిమాలో బన్నీ సరసన ఓ హీరోయిన్‌గా నటించి వావ్‌ అనిపించింది కేథరిన్‌.

అయితే ఆ సినిమా సరైన విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ‘సరైనోడు’ ఎంఎల్‌ఏగా నటించి మెప్పించింది. ఈ ఇద్దరి మధ్య ట్రాక్‌ సినిమాలో బాగా వర్కవుట్‌ అయ్యింది. ఇప్పుడు ఇదే జోడీని ‘పుష్ప 2’ సినిమాలో తీసుకురావడానికి సుకుమార్‌ ప్లాన్‌ చేశారు. ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో ఓ లేడీ పొలిటిషియన్‌ పాత్ర ఒకటి ఉందట. దానికి కేథరిన్‌ అయితే బాగుంటుందని టీమ్‌ అనుకుందట. ఈ క్రమంలో ఆ సినిమాలో కేథరిన్‌ను తీసుకుంటున్నారట.

అయితే ఆ పాత్ర పాజిటివ్‌గా కనిపించి, ఆఖరున బన్నీకి షాక్‌ ఇచ్చేలా ఉంటుందని టాక్‌. త్వరలో కేథరిన్‌ సినిమా టీమ్‌తో జాయిన్‌ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ కోసం సుకుమార్‌ అన్నిరకాల ఆలోచనలు చేస్తున్నారు. కథను మరింత పకడ్బందీగా రాసుకుని, స్క్రీన్‌ప్లేను టైట్‌ చేశారట. ఇప్పుడు నటీనటుల ఎంపిక విషయంలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారట. అలాగే గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్స్‌ వేస్తున్నారట.

అందులో భాగంగానే కేథరిన్‌ను తీసుకున్నారు అంటున్నారు. దీంతోపాటు స్పెషల్‌ సాంగ్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌ను తీసుకునే పనిలో కూడా ఉన్నారట. త్వరలోనే ఈ మొత్తం విషయాలపై క్లారిటీ అయితే రాదు కానీ.. పుకార్లు అయితే వస్తాయి. సినిమా షూటింగ్‌ పూర్తిస్థాయిలో మొదలైతే లీకులు పక్కా. అసలే మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్ల సినిమా. లీకులు పరమ సాధారణం. ఎంతో కష్టపడి వాళ్ల టీమ్‌ ఆపుతాం అనుకుంటారు కానీ.. లీక్‌లు కేకుల్లా బయటకు వచ్చేస్తుంటాయి కదా.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus