‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ కొడుకు జస్విన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి రవితేజ, అల్లు శిరీష్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. జబర్దస్త్ తో తనకంటూ మంచి గురించి తెచ్చుకున్న ప్రసన్న కుమార్ టాలెంట్ ను గుర్తించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఎక్కువగా తన సినిమాలకు రైటర్ గా పెట్టుకుంటూ ఉంటాడు.
ప్రస్తుతం రవితేజ- త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ధమాకా’ చిత్రానికి కూడా రైటర్ గా పనిచేస్తున్నాడు ప్రసన్న. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి రవితేజకి ప్రసన్నతో సాన్నిహిత్యం పెరిగింది. అందుకే అతని కొడుకు పుట్టినరోజు కి ప్రత్యేకంగా విచ్చేసి జస్విన్ ను ను ఆశీర్వదించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :